IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? వేలంలో 7 మంది బంగ్లాదేశ్ ఆటగాళ్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2027 Auction: భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు (Cricket Ties) మళ్లీ గాడిన పడుతున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా ఉన్న వివాదాలను పక్కన పెట్టి, రాబోయే ఐపీఎల్ 2027 వేలంలో (IPL 2027 Auction) బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాల్గొనేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సాధారణ ప్రక్రియలో భాగంగా, త్వరలో జరగబోయే ఐపీఎల్ మినీ వేలం (IPL Mini-Auction) కోసం బీసీసీఐ వివిధ దేశాల క్రికెట్ బోర్డులను సంప్రదించింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) కూడా ఉండటం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్‌లో నెలకొన్న అశాంతి కారణంగా దాదాపు పది నెలల క్రితం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో బీసీసీఐ ఆదేశాల మేరకే కేకేఆర్ ఆ నిర్ణయం తీసుకుంది.
అయితే, ఇప్పుడు పరిస్థితులు మారడంతో డిసెంబర్ 16న జరగనున్న ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొనేందుకు ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman) మళ్లీ తన పేరును రిజిస్టర్ చేసుకుంటున్నట్లు ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. ముస్తాఫిజుర్‌తో పాటు మరో ఆరుగురు బంగ్లా ప్లేయర్లు కూడా ఈ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారట. ఆ జాబితాలో నహిద్ రాణా (Nahid Rana), రిషాద్ హొస్సేన్ (Rishad Hossain), హసన్ మహమూద్ (Hasan Mahmud), తౌహిద్ హృదయ్ (Towhid Hridoy), తస్కిన్ అహ్మద్ (Taskin Ahmed), షోరిఫుల్ ఇస్లాం (Shoriful Islam) ఉన్నారని తెలుస్తోంది.
Also Read
- CM Vijay: ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ సీరియస్ వార్నింగ్.. నేడు మరోసారి కీలక భేటీ
- Astrology: నవంబర్ 12 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్
- CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
- IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
ఇక, గత ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరిగిన దాడుల వార్తల నేపథ్యంలో, బంగ్లా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది జనవరిలో ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని బీసీసీఐ సూచించగా, కేకేఆర్ అతడిని వదులుకుని రీప్లేస్మెంట్ ప్లేయర్‌ను తీసుకుంది. నిజానికి గత డిసెంబర్ వేలంలో రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో (Base Price) బరిలోకి దిగిన ముస్తాఫిజుర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య గట్టి పోటీ నడిచింది. చివరకు కేకేఆర్ ఏకంగా రూ. 9.20 కోట్ల రికార్డు ధరకు అతడిని దక్కించుకుని, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన బంగ్లాదేశ్ క్రికెటర్‌గా నిలిపింది.
ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడంపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. దీనికి నిరసనగా, భద్రతా కారణాలను చూపుతూ 2026 టీ20 వరల్డ్ కప్ (2026 T20 World Cup) కోసం తమ జట్టును భారత్‌కు పంపేందుకు బీసీబీ నిరాకరించింది. తమ మ్యాచ్‌లను భారత్ నుంచి సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంకకు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ మండలిని (ICC) కోరింది. కానీ ఐసీసీ ఆ డిమాండ్‌ను తిరస్కరించడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకుంది. దీంతో బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ (Scotland) జట్టుకు వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం దక్కింది. ఇన్ని నాటకీయ పరిణామాల తర్వాత ఇప్పుడు మళ్లీ ఏడుగురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలోకి రావడం క్రీడాభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? వేలంలో 7 మంది బంగ్లాదేశ్ ఆటగాళ్లు..!
-
RBI Money Transfer Update: RBI కొత్త మనీ ట్రాన్స్ఫర్ రూల్స్.. బ్యాంక్ ఖాతా లేకున్నా NEFT ద్వారా రూ.50,000 పంపొచ్చు!
-
CM Vijay: ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ సీరియస్ వార్నింగ్.. నేడు మరోసారి కీలక భేటీ
-
Pakistan Terror Attack: పాకిస్థాన్‌లో ఘోర ఉగ్రదాడి.. DSP, సబ్ ఇన్స్పెక్టర్ సహా 10 మంది పోలీసుల మృతి
-
Astrology: నవంబర్ 12 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!