January 12 Vidudala: సంక్రాంతి రేసులో ముందే దూకుడు.. అమెరికాలో సందడి చేయనున్న ‘జనవరి 12 విడుదల’ టీమ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
January 12 Vidudala: సంక్రాంతి బాక్సాఫీస్ బరి అంటేనే టాలీవుడ్లో అతిపెద్ద యుద్ధం. ఈ పండగ సీజన్లో నిలబడటానికి ప్రమోషన్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. అయితే, సంక్రాంతి రేసులోకి రాకముందే ప్రమోషన్ల విషయంలో మిగతా సినిమాల కంటే ఓ అడుగు ముందుంటూ సరికొత్త దూకుడు ప్రదర్శిస్తోంది ‘జనవరి 12 విడుదల’ చిత్ర యూనిట్. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రమోషన్లను ఏకంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తూ, ప్రమోషనల్ వేటను అమెరికా గడ్డపై నుంచే మొదలుపెట్టాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది.
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి వంటి భారీ తారాగణం నటిస్తుండటంతో మొదటి నుంచే ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు చిత్ర బృందం అమెరికాలో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకూ చేయని స్థాయిలో భారీ ప్రమోషనల్ ఈవెంట్లను ప్లాన్ చేసింది. సంక్రాంతికి ముందే ఓవర్సీస్ మార్కెట్‌ను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా మొత్తం చిత్ర యూనిట్ అమెరికాకు పయనం కానుంది. డిసెంబర్ నెలాఖరులో ప్రవాసాంధ్రుల సమక్షంలో భారీ ఎత్తున ప్రమోషన్లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 26, 27 చికాగో నగరంలో గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్లు, తర్వాత డిసెంబర్ 29, 30, 31 ఆస్టిన్, డల్లాస్ నగరాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌తో కూడిన ప్రమోషన్లను మేకర్స్ ప్లాన్ చేశారు. పండగ సీజన్‌కు ముందే యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారీ హైప్ క్రియేట్ చేయాలనే పక్కా వ్యూహంతో మేకర్స్ ఈ టూర్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Poonam Kaur : ముందుంది అసలు సినిమా.. పవన్ విడాకుల వేళ పూనమ్ కౌర్ ట్వీట్ కలకలం!
- Rashmika: రష్మిక క్రేజ్‌కు వరుస బ్రేకులు.. 'మైసా'తో బౌన్స్ బ్యాక్ అవుతుందా?
- Nidhi Aggerwal : చేతిలో ఒక్క హిట్ లేదు కానీ సెట్స్‌లో చుక్కలు చూపించిన హీరోయిన్..ఆగిపోయిన షూటింగ్?
- Babu Mohan: ‘దరిద్రం వెంటపడితే అంతే!’.. ది ప్యారడైజ్ టీమ్‌పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి జీ.వీ. ప్రకాష్ కుమార్ బాణీలు సమకూరుస్తున్నారు. విడుదల తేదీని టైటిల్లోనే పెట్టుకున్న ఈ సినిమాను 2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఇతర సంక్రాంతి చిత్రాలు ఇంకా ప్రమోషన్స్ ఆలోచనల్లో ఉండగానే, విదేశాల్లో భారీ ఈవెంట్లతో ‘జనవరి 12 విడుదల’ టీమ్ చూపిస్తున్న ఈ దూకుడు పండగ రేసులో సినిమాకు భారీ ఓపెనింగ్స్ అందించడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.
Get ready for the BIGGEST PROMOTIONAL EVENT OF TELUGU CINEMA IN USA 🇺🇸❤️🔥
The entire team of #January12Vidudala is all set to take over Chicago (Dec 26–27), Austin & Dallas (Dec 29,30, 31) with an exciting promotional tour. 💥
Mark your calendars and get ready for an unforgettable experience. More updates soon!
Grand Worldwide Release on JANUARY 12th, 2027 ✨
Victory @VenkyMama @NANDAMURIKALYAN @AnilRavipudi @KeerthyOfficial @IamKrithiShetty @gvprakash @sahugarapati7 @YoursSKrishna @Shine_Screens @ZeeStudios_ @SureshProdns @zeestudiossouth @zeemusicsouth #NileshDeorah @girishjohar #AmeetBhuvan @IamDivyaVijay @HaashtagMedia @UrsVamsiShekar
— Shine Screens (@Shine_Screens) November 11, 2026
తాజావార్తలు
-
January 12 Vidudala: సంక్రాంతి రేసులో ముందే దూకుడు.. అమెరికాలో సందడి చేయనున్న ‘జనవరి 12 విడుదల’ టీమ్!
-
Goree Beauty Cream: భారత్‌లో పాకిస్తానీ ఫెయిర్‌నెస్ క్రీమ్.. వాడితే కిడ్నీలు ఖతం..
-
Holiday Cancel: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రెండో శనివారం సెలవు క్యాన్సిల్..
-
Poonam Kaur : ముందుంది అసలు సినిమా.. పవన్ విడాకుల వేళ పూనమ్ కౌర్ ట్వీట్ కలకలం!
-
Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్‌లో రోడ్డున పడ్డ ఇంజనీర్!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!