People Media factory Rubbishes Rumors about Chiranjeevi Kalyan krishna Movie: మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది. సరిగ్గా రెండు వారాల్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈలోపే చిరంజీవి మరో సినిమాని లైన్ లో పెట్టినట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం, బంగార్రాజు మూవీల డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో చిరు మూవీ చేయనున్నారని ప్రచారం జరగ్గా ఈ విషయాన్ని చిరు సోషల్ మీడియాలో వెల్లడించారు కూడా. అయితే, ఈ సినిమాకి ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల తన సొంత బ్యానర్ లో నిర్మించాలనుకున్నా ఇప్పుడు ఈ మూవీ నిర్మాణ బాధ్యతలు మరో సంస్థ కూడా తీసుకోనుందని ప్రచారం మొదలైంది.
Chiranjeevi: చిరంజీవిపై కేసు.. తొమ్మిదేళ్ల తరువాత కొట్టేసిన హైకోర్టు
ఈ సినిమాలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఎంట్రీ ఇస్తుందని మొత్తంగా పీపుల్స్ మీడియా, సుష్మిత కొణిదెల కలిసి నిర్మించానుందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో ఎంట్రీ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక అఫీషియల్ అనౌన్స్ మెంట్ రిలీజ్ చేసింది. మెగాస్టార్ గారితో ఎప్పుడైనా సినిమా చేయడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా సంతోషంగా ఉందని ఒక నోట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లు పూర్తిగా ఊహాజనితాలు అని అందులో నిజం లేదని ఒక ప్రకటన రిలీజ్ చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. ఇక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.