Peddi : పెద్ది రిలీజ్ ఆ రోజే.. నో డౌట్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రన్‌టైమ్ విషయంలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర పీఆర్ టీం తాజాగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఆ పుకార్లకు చెక్ పెట్టింది. నెట్టింట ప్రచారమవుతున్న రన్‌టైమ్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. సినిమా నిడివి 3 గంటలకు పైగా ఉంటుందని వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరింది. సినిమా మొదటి భాగం ఎడిటింగ్ పూర్తయి ఇప్పటికే లాక్ చేయబడింది, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఫస్టాఫ్‌కు సంబంధించి రీ-రికార్డింగ్ (RR) పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. రెండో భాగం ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది, సమాంతరంగానే ఎడిటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read : Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’లో యంగ్ హీరో సర్ప్రైజ్ ఎంట్రీ
Also Read
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
- Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పక్కా ప్లానింగ్‌తో జరుగుతున్నాయని, ఎక్కడా జాప్యం లేదని టీమ్ స్పష్టం చేసింది. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ‘చికరి చికరి’ మరియు ‘రై రై రా రా’ పాటలు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ‘రై రై రా రా’ పాటలో చరణ్ వేసిన మాస్ స్టెప్పులు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమనిపిస్తోంది. వృద్ది సినిమాస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
తాజావార్తలు
-
మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
-
Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
-
India vs UK Healthcare: ‘భారత్‌లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!