‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’.. పవన్ పుట్టిన రోజు సందర్బంగా ఈ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్ర టైటిల్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కు జోడిగా పూజ హెగ్డే నటించనుంది.
తాజా సమాచారం మేరకు ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్ దసరా పండగ రోజున పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలుస్తోంది. నవంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందట. ఇప్పటికే షూటింగ్ పనులు ప్రారంభమైయ్యాయి. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ షూటింగ్ ముగింపు దశలో వుంది. మరోవైపు ‘హరిహరి వీరమల్లు’ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు సినిమాలు 2022 లోనే రానుండగా.. హరీష్ శంకర్ సినిమా కూడా ఆ ఏడాది చివర్లోనే రానుంది.