Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో, ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పార్టీ ఫండ్ కోసమే సినిమాలు చేస్తున్నా అని, తన పూర్తి ఫోకస్ మొత్తం రాజకీయాల మీదనే ఉందని పవన్ చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఏపీలో పవన్ తనదైన రీతిలో ప్రచారం చేస్తున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సభ నిర్వహించారు. అందులో పవన్ పాల్గొని సందడి చేశారు. “నేను వైఎస్ రాజశేఖర్‌రెడ్డినే ఎదుర్కొన్న వాడిని, గుర్తుపెట్టుకోండి.. ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడే పంచెలు ఊడిపోయేలా తరిమి కొట్టండని చెప్పా.. నన్ను భయపెట్టాలని చూసినా, నాపై దాడులు చేసినా నేను భయపడలేదు అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన పవన్ ఎంతో పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఇంకోసారి ప్యాకేజీ అంటే.. నా జనసైనికుడి చెప్పు తీసుకుని కొడతా.. మా వీర మహిళ చెప్పు తీసుకుని కొడతా.. నాపై మాట్లాడేవాళ్లను నేను మర్చిపోను.. నా వాళ్లు మర్చిపోరు అని చెప్పుకొచ్చారు.
ఇక స్పీచ్ అనంతరం పవన్ ఉత్తరాంధ్ర జానపద కళాకారులతో కలిసి స్టేజిపై పవన్ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక మొదటిసారి పవన్ ఒక స్టేజీపై డ్యాన్స్ చేయడం. సాధారణంగానే పవన్ చాలా సిగ్గరి. స్టేజి మీద మాట్లాడడం తప్ప ఏరోజు డ్యాన్స్ వేసింది లేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోను వైరల్ గా మారుస్తున్నారు. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా సెట్స్ మీద ఉండగా.. ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయా సీతాం సినిమాలు లైన్లో ఉన్నాయి.
ఉత్తరాంధ్ర జానపద కళాకారులతో కలిసి పాదం కదిపిన జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.#JanaSenaYuvaShakti pic.twitter.com/neJMQM35Ev
— JanaSena Party (@JanaSenaParty) January 12, 2023