పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు చేస్తున్నాడు. ఈ సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువగా OGని పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్. యంగ్ డైరెక్టర్ సుజీత్ పవర్ ప్యాక్డ్ మూవీగా OGని తెరకెక్కిస్తున్నాడు. ఏప్రిల్ నెలలో షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది అంటే OG స్పీడ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. ముంబై గ్యాంగ్ వార్ బ్యాక్ డ్రాప్‌లో OG తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ బ్రేక్ లో ఉంది. ఇదిలా ఉంటే అసలు OG సినిమా బడ్జెట్ ఎంత? పవన్ రెమ్యూనరేషన్ ఎంత? అంతమంది బిజీ స్టార్స్ నటిస్తున్నారు వాళ్లందరినీ రీజనల్ సినిమాలో చూస్తామా అనే విషయాలపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
OG కోసం పవన్ ఏకంగా వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని అంటున్నారు. లేటెస్ట్‌గా నటుడు కమల్.. ‘ఓజీ’ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తాను కూడా ఓ పాత్ర చేస్తున్నానని.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంతకు మించి అనేలా రాబోతోందని అన్నారు. అలాగే నిర్మాత డీవీవీ దానయ్య ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారని… కరెక్ట్ బడ్జెట్ తెలియకపోయినా.. ఓజి బడ్జెట్ 400 నుంచి 500 కోట్లు వరకు ఉంటుందని అన్నారు. ఇమ్రాన్ హష్మీ లాంటి నటుడు నటిస్తుండడంతో ఆ బడ్జట్ నిజమయ్యే అవకాశం ఉంది. అయితే ఇంత ఖర్చు పెడుతూ మేకర్స్ కేవలం తెలుగు రిలీజ్ కి మాత్రమే వెళ్లే అవకాశం లేదు. పాన్ ఇండియా రేంజులోనే OG రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజులో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.