Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. ఒకప్పుడు పవన్ రాజకీయాల్లో ఉండడంతో ఆయన సినిమాలకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా రాకపోవడంతో పవన్ నిరాశలో కూరుకుపోయారు. అంతేనా.. నిత్యం పవన్ ను వైట్ అండ్ వైట్ డ్రెస్, గడ్డం, అదే జుట్టుతో చూసి.. స్టైలిష్ లుక్ లో మా హీరో ఎప్పుడు కనిపిస్తాడా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూసిన అభిమానుల జీవితంలోకి రంగులు వచ్చాయి. పవన్ వరుస సినిమాలు చేస్తూ ఉండడంతో వరుస అప్డేట్స్ తో పవన్ సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఏ ముహూర్తాన.. పవన్.. OG సెట్ లో అడుగుపెట్టాడో కానీ, అప్పటినుంచి పవన్ ఫ్యాన్స్ కు పండుగ మొదలయ్యింది.
30 years PrudhviRaj: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ కు తీవ్ర అస్వస్థత..
ఎక్కడ హీరో లుక్ బయటపడితే.. సినిమాపై అంచనాలు తగ్గుతాయి అని భయపడే బ్యానర్ లు ఉన్న ఈ కాలంలో.. నిత్యం హీరో కు సంబంధించిన లుక్స్ ను ఎడిట్ చేసి, అభిమానులకు గిఫ్ట్ గా ఇస్తున్నారు డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్. పవన్ ఊరికే అలా నుంచున్నా.. సెట్ లో కూర్చున్నా.. సెట్ కు వస్తున్నా.. ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. సినిమాపై మరింత హైప్ ను పెంచేస్తున్నారు. పవన్ ఒక్క ఫోటో వస్తేనే.. దాన్ని ఎడిట్ చేసి, స్టిక్కర్లు కొట్టించి.. డీపీలు, స్టేటస్ లు పెట్టుకొని వారం దాకా తీయని అభిమానులు.. ఇలా రోజుకో ఫోటో వస్తుండేసరికి తడబడిపోతున్నారు. కొంచెం గ్యాప్ ఇవ్వండి అన్నా.. మరీ మాకన్నా వైలెంట్ గా ఉన్నారు మీరు.. ఫోటోలు అన్ని ఇలా చేసి చేసి అభిమానులను హైప్ తో చంపేస్తారా..? గ్యాప్ ఇవ్వండి.. మేము కూడా ఆ ఆనందాన్ని తట్టుకోవాలిగా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.