పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో మళ్లీ స్పీడ్ పెంచుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పవన్ ఫ్యాన్స్‌లో జోష్ పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి ఆయన రాబోయే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఉంది. ఈ సినిమా పవన్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఆ సినిమాకి తర్వాత పవన్ రాజకీయాలపై దృష్టి పెడతారని అనుకున్నారు చాలామంది. కానీ తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా కోసం ఇప్పటికే భారీ అడ్వాన్స్ తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.
Also Read : Mahakali : ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుండి మరో పవర్‌ఫుల్ అప్‌డేట్!
తెలుసిన వివరాల ప్రకారం, చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న KVN ప్రొడక్షన్స్ బ్యానర్, పవన్ కళ్యాణ్‌కి సుమారు రూ.20 కోట్ల భారీ అడ్వాన్స్ చెల్లించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ బ్యానర్‌లో పవన్ ఒక పవర్‌ప్యాక్డ్ ఎంటర్టైనర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. అయితే, డైరెక్టర్ ఎవరన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. కొందరు ప్రముఖ దర్శకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, రాజకీయం–సినిమా మధ్య పవన్ తన టైమ్‌ని ఎలా మేనేజ్ చేస్తాడన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా చూస్తే, పవర్ స్టార్ సినిమాల లైన్ అప్ ఒక్కసారిగా మళ్లీ రీబూస్ట్ అయినట్లే!