సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా పంచుకున్న ఓ పిక్ నెట్టింట్లో రచ్చ చేస్తోంది. తమన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి పవర్ ఫుల్ హగ్ అంటూ ఓ స్పెషల్ పిక్ ను షేర్ చేశారు. తన మ్యూజిక్ స్టూడియోలో విశేషం చోటు చేసుకుంది. ఈ పిక్స్ చూస్తుంటే “భీమ్లా నాయక్” చిత్రానికి తమన్ అద్భుతమైన సంగీతం అందించినందుకు పవన్ చాలా సంతోషంగా ఉన్నట్లు అన్పిస్తోంది. ఈ గుర్తుండిపోయే చిత్రాన్ని తీసినందుకు త్రివిక్రమ్‌కి కృతజ్ఞతలు తెతెలిపాడు తమన్. ఈ పిక్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Read Also : Pushpa : ‘పుష్ప’రాజ్ కు అరుదైన గౌరవం… మూవీ ఆఫ్ ది ఇయర్
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన “భీమ్లా నాయక్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం జరుగనుంది. ఈ వేడుకకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే రాశారు. ఇక తమన్ అందించిన సాంగ్స్ రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక తమన్ ఖాతాలోనూ పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.
