పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ‘బ్రో’. మెగా ఫాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీగా ఉంది. రిలీజ్ కి మరో అయిదు రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ బ్రో సినిమా ప్రమోషన్స్ ని స్పీడప్ చేస్తూ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. పవన్ కళ్యాణ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యిందంటే సోషల్ మీడియాలో హంగామా ఓ రేంజులో ఉంటుంది. ఎన్ని వ్యూస్ రాబట్టింది, ఎన్ని లైక్స్ కొట్టారు అంటూ ఫాన్స్ లెక్కలేస్తూ ఉంటారు. ఎప్పటిలాగే బ్రో ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో సెన్సేషనల్ వ్యూస్ రాబడుతోంది. రిలీజ్ అయిన పది గంటల్లోనే బ్రో ట్రైలర్ 11 మిళియన్స్, 500K లైక్స్ ని రాబట్టింది. 24 గంటలు కంప్లీట్ అయ్యే లోపు ఈ వ్యూస్ కౌంట్ మరింత పెరగడం గ్యారెంటీ.
ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ స్వాగ్ అండ్ స్టైల్ ని మెగా ఫాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ అండ్ పవన్ కళ్యాణ్ మధ్య వచ్చిన సీన్స్ కూడా ఫాన్స్ లో జోష్ నింపింది. టీజర్, ట్రైలర్ తో మంచి ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేసిన డైరెక్టర్ సముద్రఖని, అదే ఇంపాక్ట్ ని సినిమాలో కూడా మైంటైన్ చేస్తే బ్రో మూవీ సాలిడ్ ఓపెనింగ్స్ రాబడుతుంది. ఇప్పటివరకూ బ్రో ప్రమోషన్స్ సోసోగానే ఉండడంతో హైప్ అంతంతమాత్రంగానే ఉంది, ట్రైలర్ రిలీజ్ తో ఒక్కసారిగా హైప్ పెరిగింది. ఇక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ రిలీజ్ డేట్ వరకూ హైప్ మైంటైన్ చేయాల్సిన అవసరం ఉంది. జులై 25వ తేదీన ఎలాగూ బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఆ రోజు పవన్ నుంచి ఒక జోష్ ఫుల్ స్పీచ్ వస్తే చాలు మెగా ఫాన్స్ అంతా అలర్ట్ అయిపోతారు.
Bringing you all a POWERful Bolt of SUPREME Entertainment with #BroTheAvatar 🔥⚡#BroTrailer is out now ▶️ https://t.co/6kgURvkRjk
Worldwide Grand Release in Theatres on JULY 28th! ⏳@PawanKalyan @IamSaiDharamTej@TheKetikaSharma @thondankani @MusicThaman @vishwaprasadtg pic.twitter.com/BQX9sMaqqb
— Vivek Kuchibhotla (@vivekkuchibotla) July 22, 2023