OG : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. కొందరేమో వంద కోట్ల రెమ్యునరేరషన్ అంటున్నారు. ఇంకొందరేమో రూ.150 కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవేవీ నిజం కాదు. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ రూ.80 కోట్లు.
Read Also : Sujith : డైరెక్టర్ సుజీత్ భార్యను చూశారా.. హీరోయిన్లు పనికిరారు
సుజీత్ ఈ మూవీ కోసం రూ.8 కోట్లు తీసుకున్నారు. ఓమీ పాత్ర చేసిన ఇమ్రాన్ హష్మీ రూ.5 కోట్లు అందుకున్నాడు. అలాగే ప్రియాంక అరుల్ మోహన్ రూ.2 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రూ.3 కోట్ల దాకా తీసుకున్నాడు. గత సినిమాల కంటే ఈ సినిమాకే పవన్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఓజీ సినిమాపై భారీ స్థాయి అంచనాలున్నాయి. ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. పవన్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకున్నారో ఇందులో అలాగే కనిపించబోతున్నాడు. మరి రేపు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
Read Also : Coolie : కూలీలో మంచి పాత్ర ఇవ్వలేదు.. లోకేష్ పై నటి షాకింగ్ కామెంట్స్