Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలు.. ఇంకోపక్క సినిమాలు అంటూ రెండు పడవల మీద కాలు పెట్టి నడుస్తున్నాడు. రెండింటిని సమానంగా మ్యానేజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బయగా మారాడు. దాదాపు ఆయన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఒకదాని తరువాత మొదలుపెట్టి ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడు. ఇక పవన్ సినిమాలు విషయం పక్కన పెడితే.. వ్యక్తిగతంగా ఆయన చాలా సైలెంట్. తాను, తన పుస్తకాలు, పిల్లలు అంతే ఆయన లోకం. ముఖ్యంగా అకీరా చిన్నప్పుడు.. పవన్ ను వదిలి అస్సలు ఉండేవాడు కాదట. ఎక్కడకు వెళ్లిన అకీరా ఉండేవాడు. అతడితో కలిసి ఆడుకోవడం అంటే పవన్ కు చాలా ఇష్టమట. తాజాగా ఈ తండ్రీకొడుకులు క్రికెట్ ఆడుతున్న ఒక పాత ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
Sreeleela: చిన్నా లేదు.. పెద్దా లేదు.. అందరి కన్ను పాప మీదే..?
అకీరా క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడుతుంటే.. వెనుక పవన్ కళ్యాణ్ కొడుకును చూస్తూ నిలబడి ఉన్నాడు. పవన్ లుక్ ను బట్టి అది పంజా సినిమా టైమ్ లో అన్నట్లు తెలుస్తోంది. కొడుకు సచిన్ లా క్రికెట్ ఆడుతుంటే.. పవన్ ఎంతో మురిసిపోతున్నట్లు కనిపించాడు. కొడుకు ఏది చేసినా తండ్రి పైకి చెప్పకపోయినా లోపల సంతోషిస్తూనే ఉంటాడు. ఈ ఫొటోలో పవన్ కూడా అలాగే కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అకీరా చూస్తూ ఉండగానే ఎదిగిపోయాడు. తండ్రిని మించిన హైట్ తో .. మెగా హీరోలా మారిపోయాడు. ప్రస్తుతం చదువు మీద శ్రద్ద పెట్టిన అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.