Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. కోలీవుడ్ లో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటించగా.. చిరు సరసన తమన్నా నటించింది. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన టాక్ ను మాత్రం అందుకోలేకపోయింది. చిరు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఆ నటన కొద్దిగా అతిగా ఉందని అభిమానులు అంటున్నారు. అస్సలు సినిమా ఎందుకు తీశారు అనేలా అభిమానులు మాట్లాడడం విశేషం. ఇక ఈ సినిమాలో చిరు.. కామెడీ టైమింగ్ బావుంటుందని మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. కానీ, కథనే అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఆయన కామెడీని తట్టుకోవడం కష్టమని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పరువు తీసేసినట్లు పవన్ ఫ్యాన్స్ చిరును, మెహర్ ను ఏకిపారేస్తున్నారు. అందుకు కారణం ఖుషీ నడుము సీన్ ను రీక్రియేట్ చేసి దానికి ఉన్న ఇమేజ్ ను చెడగొట్టారని చెప్పుకొస్తున్నారు.
Bholaa Shankar: పొరపాటున కూడా థియేటర్ విజిట్ కు రావద్దు మెహర్ అన్నా..
పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన ఖుషీ సినిమా గురించి అందులో ఉన్న నడుము సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భూమిక నడుమును పవన్ చూసే సీన్ సినిమాకే హైలైట్ గా నిలవడమే కాదు.. ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్ గా కొనసాగుతోంది. అయితే భోళా శంకర్ షూటింగ్ నడుస్తున్న సమయంలోనే ఈ సీన్ ను చిరు రీ క్రియేట్ చేస్తున్నట్లు వార్తలు రావడం.. అందులోనూ శ్రీముఖితో చిరు ఈ సీన్ చేయడం అనేది చిరు ఫ్యాన్స్ కు మింగుడు పడలేదు. ఇంకోపక్క పవన్ ఫ్యాన్స్ అప్పటి నుంచి ఇలాంటి సీన్స్ పెట్టొద్దు అని చెప్పుకొచ్చారు కూడా.. కానీ, మెహర్.. చిరుతో ఆ సీన్స్ చేయించి తప్పు చేశాడు. అసలు ఈ సీన్ చూసాక థియేటర్ లో అందరూ తలల కొట్టుకుంటున్నట్లు ఫ్యాన్స్ తెలుపుతున్నారు. ఆ సీన్ అస్సలు బాలేదని, పవన్ పరువు తీసేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.