Pavitra Gowda Pavitra Lokesh Pavitra Jayaram Similarities: మొన్న పవిత్ర లోకేష్, నిన్న పవిత్ర జయరాం, నేడు పవిత్ర గౌడ. వెనక పేర్లు ఏవైనా పవిత్ర మాత్రమే ఇక్కడ కామన్. వీళ్ళందరూ కన్నడ సినీ పరిశ్రమలో పని చేసిన వాళ్లే. వీళ్ళ వల్ల కనడ సినీ పరిశ్రమకు ఇప్పుడు బ్యాడ్ నేమ్ రావడం హాట్ టాపిక్ అవుతోంది. కాకతాళీయమో యాదృచ్ఛికమో తెలీదు కానీ పవిత్ర పేరు పెట్టుకుని నటులుగా కన్నడ సినీ పరిశ్రమలో ఉన్నవారు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. కొన్నాళ్ల క్రితం తెలుగు నటుడు నరేష్ తో పవిత్ర లోకేష్ సహజీవనం అంశం ఒక్కసారిగా తెరమీదకు వచ్చి తెలుగు కన్నడ సినీ పరిశ్రమలను మాత్రమే కాదు తెలుగు కన్నడ ప్రజలను సైతం ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేసింది.
Pavitra Gowda : హీరో దర్శన్ ప్రియురాలు పవిత్ర మొదటి భర్త ఎవరో తెలుసా?
అది ఇంకా మరిచిపోక ముందే కొన్నాళ్లకు పవిత్ర జయరాం మరణంతో మరో షాక్ తగిలింది. భర్త, పిల్లలు ఉండగానే సహ నటుడితో సహజీవనం చేస్తూ పవిత్ర జయరాం చర్చనీయాంశమైంది. ఇక ఆ అంశం అది మరువక ముందే ఇప్పుడు పవిత్ర గౌడ అంశం కూడా అదే విధంగా తెరమీదకు వచ్చింది. పెళ్లయి పిల్లలు ఉన్న దర్శన్ తో ప్రేమలో పడటమే కాదు అతనితో లివింగ్ రిలేషన్ లో ఉంటూ ఇప్పుడు అతనితో కలిసి హత్య చేసి తాను ఏ వన్ ముద్దాయిగా నిలవడమే కాదు దర్శన్ ను ఏ 2 ముద్దాయిగా నిలబెట్టింది. అలా పవిత్ర పేరు పెట్టుకున్న ముగ్గురు కన్నడ సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు అదే కన్నడ సినీ పరిశ్రమ చర్చనీయాంశం కావడానికి కారణమయ్యారు అనేది నిర్వివాదాంశం.