Pathaan Crosses 50crs In Advance Bookings: పఠాన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా నామస్మరణమే! దాదాపు ఐదేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ చేసిన సినిమా కావడం, చాలాకాలం నుంచి బాలీవుడ్‌లో సరైన హిట్ లేకపోవడం.. ఇది స్పై బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమా కావడంతో.. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు వచ్చిన వివాదాలు సైతం ఈ సినిమాకి బాగానే ప్లస్ అయ్యింది. ఈ సినిమాని జనాల్లోకి మరింతగా తీసుకెళ్లడంలో సహాయం చేసింది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం చాలా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అటు.. జనాలు కూడా ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఉన్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.. అడ్వాన్స్ బుకింగ్సే!
Adivi Sesh: అడవి శేష్ ఇంట పెళ్ళి బాజాలు!
బాలీవుడ్ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో.. అడ్వాన్స్‌గా ఈ సినిమా టికెట్లు అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇది రూ.50 కోట్లకు పైగా రాబట్టిందని సమాచారం. మొదటి రోజు ఈ సినిమాని చూసేందుకు 7 లక్షల 65 వేల 251 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇంకా అమ్ముడుపోతూనే ఉన్నాయి. రెండో రోజు అంతకుమించి టికెట్లు సోల్డ్ అవ్వగా.. మూడో రోజు 5,82,987 టికెట్లు బుక్ అయినట్లు తేలింది. ఇప్పటివరకు మొత్తం 18 లక్షల 380 టికెట్లు అమ్ముడైతే.. 50 కోట్ల 46 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బుకింగ్స్ రూపంలోనే ఇంత విధ్వంసం సృష్టిస్తోందంటే.. ఇక విడుదలయ్యాక ఈ సినిమా సృష్టించే ప్రభంజనం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తొలిరోజే ఈ సినిమా గత రికార్డులన్ని బద్దలయ్యేలా.. భారీ వసూళ్లు నమోదు చేయొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తాయి. చూస్తుంటే.. షారుఖ్ చాలా గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.
Lakshmi Parvathi: ఆ యువ నాయకుడికి జైలు ఖాయం
సిద్ధార్థ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ఒక రా ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. నటి దీపికా పడుకొనే కథానాయికగా నటిస్తుండగా.. జాన్ అబ్రహం నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపించనున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని సుమారు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. స్పై యూనివర్స్‌లో ఇదో భాగం కాబట్టి.. ఇందులో సల్మాన్ ఖాన్ కూడా ఓ కేమియోలో మెరనున్నట్టు సమాచారం.
Kapunadu: బాలయ్య, టీడీపీలకు కాపునాడు అల్టిమేటం