Kapunadu: బాలయ్య, టీడీపీలకు కాపునాడు అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kapunadu Ultimatum To Balakrishna And TDP: నందమూరి బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీకి కాపునాడు అల్టిమేటం జారీ చేసింది. స్వర్గీయ ఎస్వీ రంగారావును ఉద్దేశించి బాలయ్య ‘‘ఆ రంగారావు, ఈ రంగారావు’’ అంటూ చేసిన వ్యాఖ్యలను కాపు సామాజిక వర్గం కాపునాడు తీవ్రంగా పరిగణించింది. గతంలో కూడా రాజకీయాల్లో చిరంజీవి విఫలమయ్యారని, రాజకీయాల్లో విజయం తమకే సాధ్యమంటూ ‘‘మా బ్లడ్డు వేరు, మా బ్రీడు వేరు’’ అన్న మాటలు సైతం కాపుల మనోభావాల్ని దెబ్బతీశాయి. జనసేన పార్టీలో తిరిగే వారందరూ.. అలగాజనం అని, సంకరజాతి జనం అని అన్న మాటలు కాపుల గుండెల్లో గునపాలు దింపాయన్నారు. బాలయ్య చేసిన ఆ వ్యాఖ్యలప 25వ తేదీ సాయంత్రంలోపు మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని కాపునాడు డిమాండ్ చేసింది. ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే.. రాష్ట్రంలో ఉన్న వంగవీటి రంగారావు విగ్రహాల వద్ద కాపు సోదరులందరూ ప్లాకార్డులు ప్రదర్శించి, మౌన నిరసన తెలపాలని కాపునాడు పిలుపునిచ్చాడు.
KTR: మంత్రి నోట ఆసక్తికరమైన మాట.. మోడీ దేవుడు ఎందుకయ్యాడు ?
Also Read
గతంలో దేవబ్రాహ్మణులకి సంతకం లేని లేఖ విడుదల చేసినట్టు కాకుండా.. స్వయంగా ప్రెస్మీట్ పెట్టి, సదరు వ్యాఖ్యలు చేసినందుకు గాను క్షమాపణ కోరాలని బాలయ్యని కాపునాడు డిమాండ్ చేసింది. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని హామీ ఇవ్వాలని.. లేకపోతే తెలుగు రాష్ట్రాలలో వంగవీటి మోహనరంగా విగ్రహాల వద్ద నిరసన చేపడుతాడమని పేర్కొంది. అలాగే.. తెలుగుదేశం పార్టీ నుండి బాలయ్యని పది సంవత్సరాల పాటు బహష్కరించాలని కాపునాడు కోరింది. ఈ షరతుకి టీడీపీ తలొగ్గకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేష్ పాదయాత్రని కాపు సామాజిక వర్గం అడ్డుకుంటుందని హెచ్చరించింది. కాగా.. వీరసింహారెడ్డి సక్సెస్‌మీట్‌లో భాగంగా బాలయ్య చేసిన ‘ఆ రంగారావు, ఈ రంగారావు.. అక్కినేని తొక్కినేని’’ అనే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య, అఖిల్ అక్కినేని సోషల్ మీడియా మాధ్యమంగా బాలయ్యపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!