బాలీవుడ్‌లో అందమైన జంట అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పరిణీతి చోప్రా – రాఘవ్ చద్ధా ద్వయమే. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్ధా తో పరిణీతి చోప్రా 2023 సెప్టెంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో లీలా ప్యాలెస్ వేదికగా ఈ వేడుక ఘనంగా జరిగింది. అప్పటి నుండి సినిమా ఈవెంట్‌లు, టీవీ షోలు, ఫంక్షన్లకు కలిసి హాజరై అభిమానుల మనసు దోచుకుంటున్నారు. తాజాగా ఈ జంట ‘కపిల్ శర్మ షో’లో సందడి చేశారు. హాస్యం, సరదా మిక్స్‌తో నిండిన ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. రాఘవ్ చెప్పులు లేకుండా రావడంతో చర్చనీయాంశంగా మారింది. ‘‘చెప్పులు ఎవరో అపహరించేశారు అందుకే ఇలా వచ్చా’’ అంటూ ముచ్చటించారు.
Also Read : Aamir Khan : ఆమిర్ ఇంటికి హఠాత్తుగా 25 మంది పోలీసులు.. అసలేం జరిగింది?
అలాగే, రాఘవ్‌ను మొదటిసారి లండన్‌లో కలిసినట్లు పరిణీతి వెల్లడించారు. ఆ సమావేశం తర్వాత ఇంటికెళ్లి రాఘవ్ హైట్ ఎంత ఉంటుందో గూగుల్‌లో సెర్చ్ చేశానని ఆమె నవ్వుతూ చెప్పారు. ఈ సందర్భంగా రాఘవ్ మాట్లాడుతూ.. ‘‘పరిణీతి ఎప్పుడూ ఏదైనా చెబితే, దానికి వ్యతిరేకంగానే జరుగుతుంది. ఓ ఇంటర్వ్యూలో రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకోను అన్నది. చివరకు ఎంపీని పెళ్లి చేసుకుంది. అందుకే నిత్యం ఆమెతో ఓ మాట చెప్పిస్తాను.. ‘రాఘవ్ ఎప్పటికీ ప్రధాని కాలేరు’. దాంతో ఆ మాట రివర్స్‌లో జరిగిపోవాలని భావించడమే’ అంటూ నవ్వేశారు. ప్రజంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.