మాస్ట్రో ఇళయరాజా ‘మ్యూజిక్ స్కూల్’లో శర్మన్ జోషి, శ్రియా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యామిని ఫిలింస్ నిర్మించనున్న కొత్త చిత్రం మ్యూజిక్ స్కూల్. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చబోతున్నారు. బ్రాడ్ వే కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే కొరియోగ్రఫీ అందిస్తున్నారు. పాపారావు బియ్యాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శర్మన్ జోషి, శ్రియా శరన్, సుహాసిని ములే, బెంజిమిన్ గిలాని, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, వినయ్ వర్మ, గ్రేసీ గోస్వామి, ఓజూ బారువా ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ‘జోధా అక్బర్’ వంటి చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన సినిమాటోగ్రాఫర్ కిరణ్ డియోహన్ ఈ చిత్రానికి విజువల్స్ అందిస్తున్నారు. అక్టోబర్ 15న మ్యూజికల్ ఈవెంట్ ప్రారంభం కానుంది.
పాపారావు బియ్యాల న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో వర్క్ చేశారు. ఆయన తెరకెక్కించిన విల్లింగ్ టు శాక్రిఫైజ్ ఓ జాతీయ అవార్డును, రెండు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ సందర్భంగా ఇళయరాజాగారితో కలిసి పనిచేయడం అదృష్టమని, గౌరవంగా భావిస్తున్నానని, అలాగే ఇళయరాజా గారి సంగీతం, పాటలు హాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రేను ఆకట్టుకోవడంతో ఆయన ఈ సినిమాకు పనిచేయడానికి అంగీకరించారని పాపారావు బియ్యాల తెలిపారు. ”ప్రస్తుతం ఉన్న విద్యావిధానంలో పిల్లలు కేవలం డాక్టర్స్, ఇంజనీర్స్ మాత్రమే కావాలంటూ తెలియని ఓ ఒత్తిడికి లోనవుతున్నారు. వీటన్నింటిని తెలియజేసి, అందరినీ ఆలోచింప జేసేలా తెరకెక్కబోతున్న ఈ మూవీలో 12 పాటలుంటాయి. హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ కామిక్ మ్యూజికల్ జర్నీ… ఎవరైతే ప్రేమ, కలలు కనడం, నవ్వడం, పాటలు పాడటం చేయాలనుకుంటారో వారి కోరికలను ప్రతిబింబించేలా ఉంటుంది” అని పాపారావు చెప్పారు.
Also Read
- Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. 'ఆర్య' కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
- Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
- JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్‌కే షాక్.. జియో హాట్‌స్టార్‌లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
- NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
Read Also : రేపు “పీఎస్పీకే 28” పవర్ ప్యాక్డ్ అనౌన్స్ మెంట్
ఈ సందర్భంగా నటుడు శర్మన్ జోషి మాట్లాడుతూ ”పాపారావుగారు దర్శకత్వంలో రూపొందనున్న ఈ మ్యూజికల్ స్కూల్ చిత్రంలో భాగం కావడంపై ఎగ్జయిటింగ్‌గా ఉంది. తొలిసారి మాస్ట్రో ఇళయరాజా గారితో వర్క్ చేయబోతున్నాను. ఇలాంటి ఓ గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. శ్రియాశరన్‌తో కలిసి వర్క్ చేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇదొక అద్భుతమైన ప్రయాణమని నాకు తెలుసు. ఎన్నో భావోద్వేగాల కలయికతో ఉన్న సంగీత ప్రవాహం. ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని అన్నారు.
శ్రియా మాట్లాడుతూ ”మనందరికీ ఇళయరాజాగారు ఓ ఇన్‌స్పిరేషన్. ఆయనతో కలిసి పనిచేయనుండటం కల నిజమైనట్టుగా ఉంది. అలాగే లండన్‌కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌తో కలిసి పనిచేయడం కూడా ఆనందంగా ఉంది. నేను లండన్ వెళ్లిన ప్రతిసారి అక్కడ జరిగే మ్యూజికల్స్ అన్నింటికీ హాజరవుతుంటాను. వేదికపై పెర్ఫామ్ చేయడాన్ని, డాన్స్ చేయడాన్ని నేనెంతగానో ఇష్టపడతాను. నేను కథక్ డాన్సర్‌ను. మరో డాన్స్ కళను నేర్చుకోబోతుండటం ఎగ్జయిటింగ్‌గా ఉంది” అని అన్నారు.

తాజావార్తలు
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్‌ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్‌చేస్తే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!