వైవిధ్యమైన స్వరంతో పాటలు పాడుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ప్రముఖ సింగర్ షాన్. ఇప్పుడు ఆయన పాపారావు బియ్యాల దర్శకుడిగా పరిచయమవుతూ తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోన్న ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం కోసం నటుడిగా మారారు. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇళయరాజా స్టూడియోలో ఓ పాట పాడిన ఈ సింగర్‌ను చూసి, పాత్రకు సరిపోతాడని భావించి తమ సినిమాలో నటించాలని చిత్ర దర్శక నిర్మాతలు కోరారు. శర్మన్ జోషి,…
యామిని ఫిలింస్ నిర్మించనున్న కొత్త చిత్రం మ్యూజిక్ స్కూల్. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చబోతున్నారు. బ్రాడ్ వే కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే కొరియోగ్రఫీ అందిస్తున్నారు. పాపారావు బియ్యాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శర్మన్ జోషి, శ్రియా శరన్, సుహాసిని ములే, బెంజిమిన్ గిలాని, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, వినయ్ వర్మ, గ్రేసీ గోస్వామి, ఓజూ బారువా ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ‘జోధా అక్బర్’ వంటి చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన…