రేపు “పీఎస్పీకే 28” పవర్ ప్యాక్డ్ అనౌన్స్ మెంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉండగానే నెక్స్ట్ మూవీకి సిద్ధమవుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ తదుపరి చిత్రం రూపొందనుంది. దీనిని ప్రస్తుతం “పిఎస్పికే 28” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా మెగా అభిమానుల్లో జోష్ ను పెంచే అప్డేట్ తో వచ్చారు. ఆ అప్డేట్ ఏమిటంటే… “రేపు ఉదయం 9.45 నిమిషాలకు పవర్ ప్యాక్డ్ అప్డేట్ తో మీ ముందుకు రాబోతున్నాం. గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్” అంటూ మెగా ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం “పీఎస్పీకే 28” నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన అప్డేట్ ను రేపు మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్ర బృందం ఇటీవల పవన్ కళ్యాణ్‌ని కలిసి సినిమా లాంచింగ్ కు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకుందని అంటున్నారు.

Read Also : బండ్ల గణేష్‌కు జీవిత కౌంటర్: టైం వేస్ట్.. చీప్‌ ట్రిక్స్.. డోంట్ కేర్..!

ఈ ప్రాజెక్ట్ కు ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. మేకర్స్ ఇంకా సినిమాకు సంబంధించిన తారాగణం, సాంకేతిక సిబ్బందిని ఖరారు చేయలేదు. ఈ ప్రాజెక్ట్ లో పవన్ సరసన పూజా హెగ్డే నటించబోతోంది అనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాకు పవన్ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే విషయం కూడా టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి పవర్ ప్యాక్డ్ అప్డేట్ అనగానే మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం, కుతూహలం పెరిగిపోయాయి. మరి ఆ అప్డేట్ ఏంటో ఖచ్చితంగా తెలియాలంటే రేపు ఉదయం వరకూ వేచి ఉండక తప్పదు.

Related Articles

Latest Articles

-Advertisement-