Palak Puraswani Reveals Shocking Secrets About Avinash Sachdev: ప్రతిఒక్కరి జీవితంలోనూ ఒక ‘గతం’ అంటూ ఉంటుంది. అయితే.. కొందరి గతం ‘మధురమైనదిగా’ ఉంటే, మరికొందరిది మాత్రం పీడకలగా మిగిలిపోతుంది. అది గుర్తొచ్చినప్పుడల్లా.. లోపల మనసుని సూదితో గుచ్చినంత బాధగా ఉంటుంది. తనకూ అలాంటి గతమే ఉందంటూ నటి పలక్ పురస్వాని ఆవేదనకు గురైంది. తన మాజీ ప్రియుడు అవినాశ్ సచ్‌దేవ్ తనని దారుణంగా మోసం చేశాడని, ఓ నటితో అతడు రొమాన్స్ చేస్తుండగా తాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానని కుండబద్దలు కొట్టింది. అప్పటికీ ఒక అవకాశం ఇచ్చినా, అతనితో మార్పు రాలేదని బోరుమని విలపించింది. బిగ్‌బాస్ హౌస్ ఓటీటీ సీజన్ 2 నుంచి ఎలిమినేట్ అయిన అనంతరం ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పలక్ తన గత గురించి చెప్పుకొచ్చింది.
Video Viral: ఆడవాళ్ల గొడవలో తలదూర్చొద్దు అని ఊరికే చెప్పారా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో..
పలక్ మాట్లాడుతూ.. ‘‘అవినాశ్‌ని నేను గాఢంగా ప్రేమించా. కానీ, అతడు నన్ను మోసం చేశాడు. మరో నటితో అతడు కులుకుతున్నప్పుడు, నేను అతడ్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాను. ఈ విషయాన్ని అతడి పేరెంట్స్‌కు కూడా చెప్పాను. ‘ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటూ అతడు నా వెంటపడేవాడు. దాంతో అతనికి మరో ఛాన్స్ ఇచ్చా, అయినా ఫలితం లేకుండా పోయింది. ఓ పార్టీలో అతడు మరోసారి వేరే అమ్మాయితో అడ్డంగా దొరికాడు. ఒకేసారి అక్కాచెల్లెళ్లతో కూడా ఫ్లర్ట్ చేసేవాడు. వాళ్లకు అతడు ఎంత గలీజ్ మెసేజ్‌లు చేశాడంటే, నేను నా నోటితో చెప్పలేను. అతని క్యారెక్టర్ తెలిసి, నా కుటుంబం చాలా బాధపడింది. అవినాశ్ గురించి తెలిసి, మా నాన్నకు గుండెపోటు వచ్చింది. మేమిద్దరం బ్రేకప్ చెప్పుకొని చాలాకాలం అవుతోంది కానీ, మా నాన్నకు మాత్రం ఇంకా పూర్తి విషయం తెలీదు’’ అంటూ పలక్ ఏడ్చేసింది.
Rekha Nair: అక్కడ చెయ్యి వేస్తే, నేను బాగా ఎంజాయ్ చేస్తా.. టీవీ నటి సంచలన కామెంట్స్