ఓ సినిమా హిట్‌గా నిలిచాక దానికి కొనసాగింపు తీయాలనుకోవడంలో తప్పు లేదు కానీ సీక్వెల్ రూపంలో చెత్త బొమ్మను అందించి ఫస్ట్ మూవీకి వచ్చిన క్రెడిట్ పొగొట్టేస్తున్నారు తమిళ తంబీలు. కోలీవుడ్ ఇలాకాలో సక్సెస్ కొట్టిన సీక్వెల్ చిత్రాల కన్నా ఫెయిలైనవే ఎక్కువ. అందులోనూ స్టార్ హీరోస్ తెలిసి తెలిసి చేతులు కాల్చుకుంటున్నారు. తమిళంలో సింగం, కాంచన, అరణ్మనై, డీమాంట్ కాలనీ సీక్వెల్స్ చిత్రాలే ప్రేక్షకులను మెప్పించగలిగాయి మిగిలినవన్నీ జెండ్ బామ్ రాసుకునే ఫిల్మ్స్‌గా మారాయి.
Also Read : Exclusive : ఏపీ సీఎంతో సినిమా పెద్దల మీటింగ్.. ఎక్కడివారు అక్కడే గప్ చుప్
నేషనల్ ఐడెంటీటీ ఉన్న కమల్ హాసన్ విశ్వరూపం2, ఇండియన్ 2 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డా సార్ మాత్రం ప్రేక్షకులపై కనికరం చూపడం లేదు. ఇండియన్ 3 అంటూ వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అయ్యాడు. కమల్ మాత్రమే కాదు విక్రమ్ ‘స్వామి స్క్వేర్’ నుండి విశాల్ సందెకోడీ2, లారెన్స్ చంద్రముఖి2, విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 వరకు ఇదే రిజల్ట్. సీక్వెల్స్ తీసి పొగొట్టుకున్న పరువును నిలబెట్టుకోలని ట్రై చేస్తున్నారు స్టార్ హీరోలు. ముందుగా చెప్పాల్సింది తలైవా రజనీకాంత్ గురించి. కెరీర్‌లో రోబో తప్ప మరో సీక్వెల్లో నటించని సూపర్ స్టార్ నెక్ట్స్ జైలర్ 2ని సిద్దం చేశాడు. కమల్ కూడా ఇండియన్ 3తో పాటు విక్రమ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. వీరితో పాటు యంగ్ యాక్టర్లకు సీక్వెల్ పిచ్చి పట్టుకుంది. ముఖ్యంగా కార్తీ సీక్వెల్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారబోతున్నాడు. ఖైదీ2, ఖాకీ2, సర్దార్2, యుగానికి ఒక్కడు సీక్వెల్, హిట్ సిరీస్4ని ఫిక్స్ చేశాడు. ఈ మేనియా విష్ణు విశాల్‌ను తాకింది. త్వరలో రాక్షసుడు, గట్టా కుస్తీ సీక్వెల్స్ ఉంటాయని ఎనౌన్స్ చేశాడు. గౌతమ్ కార్తీక్ ఇవాన్ తంతిరన్, డిమాండీ కాలనీ నుండి కూడా కొనసాగింపు చిత్రాలు రాబోతున్నాయి.