OMG2: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆయన నటిస్తున్నచిత్రాలలో ఒకటి OMG2. 20112 లో వచ్చిన OMG కు సీక్వెల్ గా OMG2 2 తెరకెక్కుతుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా తెలిసే ఉంటుంది. తెలుసుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ మల్టీస్టారర్ గా వచ్చిన చిత్రం గోపాల గోపాల.. OMG కు రీమేక్ గానే తెరకెక్కింది. 11 ఏళ్ళ తరువాత ఈ సినిమాలు సీక్వెల్ ప్రకటించాడు అక్షయ్. ఉమేష్ శుక్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పార్ట్ 1 లో పరేష్ రావల్ చేసిన పాత్రను పార్ట్ 2 లో పంకజ్ త్రిపాఠి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి పార్ట్ లో నార్మల్ లుక్ లో కనిపించిన అక్షయ్.. రెండో పార్ట్ లో శివుడుగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటిస్తూ అక్షయ్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆగస్టు 11 న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక పోస్టర్ లో అక్షయ్ శివుడి రూపంలో శివతాండవం ఆడుతున్నట్లు అనిపించాడు. సడెన్ గా చూస్తే శివుడు అనుకుంటారు కానీ, అక్షయ్ అని గుర్తుపట్టడానికి కొద్దిగా టైమ్ పడుతుందని చెప్పొచ్చు.
Samantha: ట్రెడిషనల్ లుక్ లో సమంత ఎంత అందంగా ఉందో..
OMG కథ అందరికి తెలిసిందే.. ప్రకృతి వైపరీత్యాల వలన తన షాప్ ను నష్టపోయిన ఒక వ్యక్తి దేవుడిపైనే కేసు వేస్తాడు.దేవుడంటే నమ్మకం ఉన్న భార్య, సమాజం అతన్ని వెలివేస్తుంది. అయినా అతడు దేవుడికి వ్యతిరేకంగానే పోరాడతాడు. అతడి నిజాయితీకి మెచ్చి దేవుడే.. ఆయనకు ఆ కేసు గెలవడంలో సహాయం చేస్తాడు. దేవుడు పేరు చెప్పి చాలామంది డబ్బులు గుంజుతున్నారు. మనలో ఉన్న మంచినే దేవుడు.. ఎదుటివారికి సహాయం చేసినప్పుడు ఆ దేవుడు కనిపిస్తాడు అని చెప్పే కథ OMG . మరి ఈ సెకండ్ పార్ట్ లో ఇదే కథను చూపించనున్నారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.