తమిళ స్టార్ హీరో సూర్య ఆ మధ్య అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ తో టైఅప్ అయ్యాడు. అందులో భాగంగా తన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద తీసే సినిమాలను డైరెక్ట్ ఓటీటీ ద్వారానే విడుదల చేస్తున్నాడు. అందుకే ఆ మధ్య ‘ఉడన్ పిరప్పి’, ‘జై భీమ్’ చిత్రాలు ఓటీటీ లోనే స్ట్రీమింగ్ అయ్యాయి. తాజాగా సూర్య, జ్యోతిక నిర్మించిన ‘ఓ మై డాగ్’ చిత్రమూ అమెజాన్ ప్రైమ్ లో రాబోతోంది. సీనియర్ నటుడు విజయ్ కుమార్ కొడుకు అరుణ్ విజయ్ హీరోగా నటించిన ‘ఓ మై డాగ్’లో అతని కుమారుడు అర్ణవ్ కూడా నటించడం విశేషం.
Read Also : Akhanda : టెలివిజన్ రికార్డులను బ్రేక్ చేయడానికి రెడీ
ఓ కుక్కకు పిల్లాడికి మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ ఫాదర్ – సన్ సెంటిమెంట్ మూవీని దర్శకుడు సరోజ్ షణ్ముగం తెరకెక్కించాడు. నివాస్ కె ప్రసన్న దీనికి సంగీతం అందించాడు. నిజానికి ఈ సినిమాను గత యేడాది డిసెంబర్ లోనూ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు తెలుగులోనూ డబ్ చేసి ఈ నెల 21న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇందులో విజయ్ కుమార్, మహిమా నంబియార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. మరి యాక్షన్ హీరోగా ఇటీవల కాలంలో గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ విజయ్ కు ‘ఓ మై డాగ్’ ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.