Site icon NTV Telugu

OG : ఓజీ నుంచి స్పెషల్ పోస్టర్.. పవన్ స్టైలిష్‌ లుక్

Og

Og

OG : పవన్ కల్యాన్ హీరోగా వస్తున్న ఓజీ మూవీపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. నేడు పవన్ కల్యాణ్‌ 54వ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ దీన్ని వదిలారు. ఇందులో పవన్ కల్యాణ్‌ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. కారు మీద కూర్చుని గ్లాసెస్ పెట్టుకుని మాస్ అండ్ స్టైల్ కలబోసిన లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది.

Read Also : Pawan Kalyan Birthday Special : ఇండస్ట్రీలో అగ్ర హీరో.. ప్రజల్లో జనసేనాని.. పవన్ బర్త్ డే స్పెషల్..

ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌ ఫుల్ మాసివ్ రోల్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గ్యాంగ్ స్టర్ పాత్రలో పవన్ హల్ చల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది. చాలా కాలం తర్వాత పవన్ ఇలాంటి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా భారీ అంచనాలతో వస్తోంది. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా కలెక్షన్ల ఊచకోత ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

Read Also : Chiranjeevi : పవన్ కల్యాణ్‌ కు చిరంజీవి స్పెషల్ బర్త్ డే విషెస్

Exit mobile version