MS Narayana: ఘనంగా ఎంఎస్ నారాయణ మనవరాలు వివాహం.. టాలీవుడ్ ప్రముఖుల సందడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Narayana Granddaughter Nairuthi Gets Married: తెలుగు చిత్రసీమలో పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. తాజాగా దివంగత ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ కుటుంబంలో శుభకార్యం ఘనంగా జరిగింది. ఆయన మనవరాలు, దర్శకురాలు శశికిరణ్ నారాయణ కుమార్తె నైరుతి వివాహం అజయ్ కృష్ణతో వైభవంగా జరిగింది. నిశ్చితార్థం, వివాహ వేడుకలను వారం రోజుల వ్యవధిలో నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రముఖ నటులు బ్రహ్మానందం, రావు రమేష్ వేడుకలో సందడి చేశారు. ఎంఎస్ నారాయణ కుమారుడు విక్రమ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ ప్రముఖుల సమక్షంలో వివాహ వేడుక ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎంఎస్ నారాయణ తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్, విభిన్నమైన బాడీ లాంగ్వేజ్, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరించారు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందకు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. ఆయన నటించిన ఎన్నో కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాయి. 2015లో ఆయన కన్నుమూశారు. ఆయనకు విక్రమ్, శశికిరణ్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు.
Also Read
- Hyderabad: ఇంటి గేటు వద్ద కార్తీక దీపం.. చీరకు మంటలు అంటుకుని 18 ఏళ్ల యువతి మృతి!
- Shah Rukh Khan-Kareena: పదిహేనేళ్ల తర్వాత షారుఖ్ - కరీనా కాంబో రిపీట్.. డ్యాన్స్ ఫ్లోర్‌ను దుమ్ములేపేసారుగా..!
- Natural Star Nani: యాక్షన్‌కు నాని గుడ్‌బై? మళ్లీ ఫ్యామిలీ కథల వైపు నేచురల్ స్టార్!
- 200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
తాజావార్తలు
-
MS Narayana: ఘనంగా ఎంఎస్ నారాయణ మనవరాలు వివాహం.. టాలీవుడ్ ప్రముఖుల సందడి..!
-
O Torture Prema : హీరోగా మాదాల రంగారావు మనవడి ఎంట్రీ?
-
Hyderabad: ఇంటి గేటు వద్ద కార్తీక దీపం.. చీరకు మంటలు అంటుకుని 18 ఏళ్ల యువతి మృతి!
-
HIV AIDS: ఎయిడ్స్ మరణాలు పెరుగుతున్నాయా?
-
Shah Rukh Khan-Kareena: పదిహేనేళ్ల తర్వాత షారుఖ్ – కరీనా కాంబో రిపీట్.. డ్యాన్స్ ఫ్లోర్‌ను దుమ్ములేపేసారుగా..!
ట్రెండింగ్
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!