పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న లో గ్యాంగస్టర్ యాక్షన్ ఫిల్మ్ ఓజీ. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తుండటం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా సూపర్ స్టైలిష్, మాస్ లుక్ తో అలరించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఓజీ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తిగా కంప్లీట్ అయ్యింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. దీంతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్‌ను అందిస్తూ వస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా అందిస్తున్న అప్డేట్స్ కు మాసీవ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. పైగా ఆయన తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.. అలాగే
Also Read :Renu Desai పవన్ ఫ్యాన్స్‌కు..రేణూ దేశాయ్ ఘాటైన వార్నింగ్
మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తూండటం సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ఇక రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నవీన్ నూలీ, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వైరల్ అవుతుంది. సమాచారం ప్రకారం, ఏపీ రాష్ట్రంలో ఈ సినిమా ప్రీమియర్ షోస్ రిలీజ్ ముందు రోజు (సెప్టెంబర్ 24) రాత్రి 9:00 లేదా 9:30 గంటలకు ప్రారంభమవ్వచ్చని టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో షోస్ షెడ్యూల్ కొంచెం వేరుగా ఉండొచ్చని కూడా చెప్పుతున్నారు. సెప్టెంబర్ 24 రాత్రి ప్రారంభమయ్యే ప్రీమియర్ షోస్ మూవీకి ఫ్యాన్ రియాక్షన్‌ను రియల్ టైమ్‌లో తీసుకురానున్నాయి.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.