పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి OG . యంగ్ దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఎన్నో అంచనాలు మరెంతో హైప్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ పవర్ స్టార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది OG.
Also Read : SVC49 : విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’ లాంచింగ్ కు ముహుర్తం పెట్టేసారు
అటు వసూళ్లు పరంగా OG సెన్సేషన్ చేసాడు. మొదటి రోజు ఈ సినిమా ఏకంగా రూ. 154 కోట్లు కొల్లగొట్టి పవర్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే పవర్ స్టార్ ను తొలిసారి వందకోట్ల షేర్ క్లబ్ లో చేర్చింది. అటు ఓవర్సీస్ లోను 4.7 మిలియన్ డాలర్స్ వసూళ్లు వసూళ్లు రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. కాగా ఈ రోజు సోమవారం OG వసూళ్లు హ్యుజ్ క్రాష్ అయ్యాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లోని కీలకమైన ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద క్రాష్ అయ్యింది. మొదటి ఆదివారం దాదాపు రాత్రి 9 గంటల వరకు $215k మాత్రమే వసూలు చేసింది. శనివారంతో పోలిస్తే ఆదివారం కలెక్షన్స్ లో 50% తగ్గుదల కనిపించింది. మరో రెండు రోజుల్లో కాంతారా చాప్తర్ 1 రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లోను సాలిడ్ స్టార్ట్ అందుకుంది కాంతార. ఆ సినిమా హిట్ టాక్ వస్తే ఆ ప్రభావం OG వసూళ్లపై ప్రభావం చూపే ఛాన్స్ లేకపోలేదు. మరి ఫైనల్ రన్ లో దేవర వసూళ్లను రాబడుతుందో లేదో.