Tamannaah : ఎన్నో అంచనాలు నడము వచ్చిన ఓదెల-2 వాటిని అందుకోలేక చతికిలపడుతోంది. నేషనల్ వైడ్ గా ఫాలోయంగ్ ఉన్న తమన్నాను శివశక్తిగా చూపించినంత మాత్రాన ఓ సెన్సేషన్ అవుతుంది అనుకోవడం పొరపాటే. మొదటి పార్టు ఓదెల చాలా పెద్ద హిట్టా అంటే కాదు. హిట్ టాక్ తెచ్చుకుంది అంతే. కానీ ఓదెల కంటెంట్ వేరు. అందులో వయలెన్స్, బోల్డ్ కంటెంట్ ప్రేక్షకులను ఎంగేజ్ చేశాయి. అయినంత మాత్రాన ఓదెల-2 అని పెట్టుకుటే ప్రేక్షకులు ఎగబడి చూస్తారనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ మూవీకి నిర్మాత, రచయిత అయిన సంపత్ నంది.. కథను మరింత బలంగా తీర్చిదిద్దాల్సింది. కానీ అలా చేయకపోవడం వల్ల బరువంతా తమన్నా మీదనే పడింది.
Read Also : D52 : ధనుష్ సినిమా సెట్స్ లో అగ్ని ప్రమాదం
కేవలం తమన్నా కోసమే థియేటర్లకు వచ్చేవారు ఉండొచ్చు. కానీ సాధారణ ప్రేక్షకులు వచ్చి చూడాలి అంటే కథలో బలం ఉండాలి. ఈ సినిమాలో చాలా చోట్ల నమ్మశక్యం కాని సీన్లు పెట్టేశారు. నంది లేచి రావడం.. క్లైమాక్స్ లో ఏకంగా శివుడే భూమి మీదకు రావడం అంటే కాస్త ఓవర్ గానే అనిపిస్తుంది. హర్రర్ థ్రిల్లర్ సినిమాల్లో మరీ ఈ స్థాయిలో దేవుడిని రప్పించిన ఘటనలు లేవు. కాకపోతే దేవుడు ఉన్నాడు అనే కొన్ని సంకేతాలతో సినిమాను నడిపిస్తే బాగుండేదేమో. కానీ ఓదెలలో నేరుగా శివుడినే రప్పించే వీఎఫ్ ఎక్స్ అంతగా పండలేదు.
అరుంధతి, పొలిమేర సినిమాల పోలికలు ఇందులో స్పష్టంగా ఉన్నాయి. మురళీశర్మ, వశిష్ట సింహా పాత్రలే అందుకు నిదర్శనం. పైగా తిరుపతి సమాధి దగ్గురకు వెళ్లిన ప్రతి ఒక్కరూ ఒకే కాన్సెప్టుతో వెళ్లడం కూడా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అందుకే మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసినా.. ఇప్పటి వరకు కేవలం రూ.6.5 కోట్లు వసూలు చేయడమే ఇందుకు నిదర్శనం. పాన్ ఇండియా స్థాయిలో అంటే.. మొదటి రోజు ఎంత లేదన్నా రూ.20 కోట్లు అయినా వసూలు చేయాలి కదా. నాలుగు రోజులు అవుతున్నా ఇంత తక్కువ చేయడం అంటే సినిమా భారాన్ని తమన్నా మోయలేకపోతోందని అర్థం అవుతోంది.