‘O Saathiya’: విడుదల సన్నాహాల్లో ఆర్యాన్ గౌర ‘ఓ సాథియా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aryan Gowra: ప్రతి సినిమాలోనూ ఏదో ఒక చోట ప్రేమ అనేది ఉంటుంది. అయితే ప్రేమే కథా వస్తువుగా ఉండే సినిమాలూ కొన్ని ఉంటాయి. ప్రేమ కథా చిత్రాలకు యూత్ ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంటుంది. అందుకే మేకర్లు లవ్ స్టోరీలను తెరకెక్కించేందుకు మక్కువ చూపుతుంటారు. అలాంటి ప్రేమకథా చిత్రమే ‘ఓ సాథియా’. విశేషం ఏమంటే ఈ సినిమాకు దర్శకనిర్మాతలిద్దరూ మహిళలే! తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు.
‘జీ జాంబి’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆర్యన్ గౌర ఇందులో కథానాయకుడిగా పాత్రను పోషిస్తున్నాడు. ఓ వైపు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే సినిమాల మీద మక్కువతో అతను ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆర్యాన్ గౌర మొదటి సినిమా ‘జీ జాంబి’తోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు రెండో సినిమా ‘ఓ సాథియా’ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఆర్యాన్ గౌరకు జోడిగా మిస్తీ చక్రవర్తి నటించారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలోకి వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో ఎంతగానో ఆదరణను దక్కించుకుంది. గతంలో రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్, వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘వెళ్లిపోయే’ పాటలకు మంచి స్పందన లభించింది. దాంతో సహజంగానే మూవీ మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. దానిని నిలుపుకునేలా మూవీ ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
Also Read
- Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
- Rowdy Janardhana: పార్ట్-1, పార్ట్-2 ట్రెండ్‌లో విజయ్ దేవరకొండ సినిమా?
- Chiranjeevi : నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేయబోతున్న 'చిరంజీవీస్ మెగావర్స్'!
- Janhvi Kapoor: ‘సౌత్‌లో స్క్రిప్ట్ ఉండదు.. కెమెరా ఎక్కడ పెడతారో తెలీదు’
తాజావార్తలు
-
Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
-
Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
-
Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
-
AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
-
Women’s Health : 40 ఏళ్లకే మెనోపాజ్.? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?