Yamadonga : ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. అగ్రహీరోల పాత సినిమాలు అన్నీ రీ రిలీజ్ అవుతూ మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా కొన్ని రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ లా నిలిచిపోయిన యమదొంగ రీ రిలీజ్ డేట్ ప్రకటించారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీని మే 18న రిలీజ్ చేస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఒక రకంగా సోషియో ఫాంటసీ సినిమాలకు ఊతం ఇచ్చింది ఈ మూవీనే.
Read Also : Samantha: ఇక పర్సనల్ విషయాల గురించి మాట్లాడను
ఇందులో జూనియర్ ఎన్టీఆర్ దొంగ పాత్రలో నటించి అబ్బురపరిచారు. ప్రియమణి హీరోయిన్ గా చేసింది. యముడి పాత్రలో మోహన్ బాబు నట విశ్వరూపం చూపించారు. అప్పటి వరకు కాస్త లావుగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమా నుంచే లుక్ మార్చేసుకుని స్లిమ్ గా మారిపోయారు. అప్పటి వరకు వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్ ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించింది యమదొంగ. ఈ సినిమాలోని చాలా సీన్లకు ఇప్పటికీ క్రేజ్ ఉంది. గున్నం గంగరాజు, చిరంజీవి దీన్ని సంయుక్తంగా నిర్మించారు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని 4కేలో రీ రిలీజ్ చేస్తోంది.
Read Also : Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓజీ షూటింగ్ అప్డేట్
Turn theatres into concerts and go back with lot of memories ❤🔥
Enjoy #Yamadonga on the big screens once again 💥
▶️ https://t.co/2Fe5V2awej#Yamadonga4k wide worldwide re-release on May 18th.
Bookings from 9th MAY 💥
MAN OF MASSES @tarak9999 @ssrajamouli @mmkeeravani… pic.twitter.com/GZh5xGZDHX
— Mythri Movie Distributors LLP (@MythriRelease) May 6, 2025