యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కలయికలో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులని రిపేర్ చేయడానికి దేవర సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇందులో ఫస్ట్ పార్ట్ దేవర ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ ని లాక్ చేసిన తర్వాత మిస్ చేసే ప్రసక్తే లేదంటూ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ అగ్రెసివ్ గా దేవర షూటింగ్ ని చేస్తూనే ఉన్నారు. ప్రీప్రొడక్షన్ ని చాలా టైం తీసుకున్నారు కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం వెనక్కి తిరిగి చూడట్లేదు. ఈ మధ్య కాలంలో ఇంత క్లీన్ గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ఇంకొకటి లేదు. పాన్ ఇండియా సినిమా అయినా కూడా షెడ్యూల్ డిలే లేకుండా జరుగుతున్న దేవర షూటింగ్ లో ఇప్పటివరకూ అత్యధికంగా యాక్షన్ పార్ట్ నే షూట్ చేసారు. ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ లో ఉన్న దేవర నేటి నుంచి సరిగ్గా 122 రోజుల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే ఇప్పటి వరకు దేవర నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. అలాగే విలన్, హీరోయిన్ లుక్స్ కూడా రివీల్ చేశారు. నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ దేవర టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
దేవర టీజర్ న్యూ ఇయర్ రోజున రిలీజ్ అవుతుంది అంటూ చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 1న దేవర నుంచి టీజర్, లేదా గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ న్యూ ఇయర్ మిస్ అయితే సంక్రాంతికి దేవర సాలిడ్ ట్రీట్ ఉంటుందని అనుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం మేరకు… దేవర టీజర్ డేట్ మరింత ముందుకొచ్చింది. టాలీవుడ్ బజ్ ప్రకారం దేవర ఫస్ట్ లుక్ టీజర్‌ని క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అతి త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో దేవర టీజర్ బయటికి రావడమే లేట్.. డిజిటల్ రికార్స్డ్ అన్నీ బద్దలు అవ్వడం గ్యారెంటీ అంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. టీజర్ లో కొరటాల డైలాగ్, ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ గా కూర్చుంటే చాలు దేవర హైప్ ఆకాశాన్ని తాకుతుంది.