గత వారం రోజులుగా దేవర అంటూ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దేవర టైటిల్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేవర సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంది. లేటెస్ట్ గా ఒక యాడ్ షూట్ సమయంలో ఒక చిన్న ఫోటో షూట్ సెషన్ తో అదరగొట్టేశాడు ఎన్టీఆర్. దేవరలో కనిపించిన రగ్గ్‌డ్ లుక్‌నే కాస్త ట్రిమ్ చేసి… లేటెస్ట్ లుక్‌లో షార్ప్‌గా కనిపిస్తున్నాడు ఎన్టీఆర్. ఓ బ్రాండ్ ఎండోర్స్ మెంట్ కోసం కాస్త సాఫ్ట్ లుక్‌లో కనిపించాడు తారక్. చాలా స్టైలిష్‌గా, మ్యాన్లీగా ఉన్నాడు. ఈ స్టిల్స్‌లో డిఫెరెంట్ మూడ్‌లో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ కాలర్ ఎగరేస్తున్న ఫోటో ఒకటి.. ఫ్యాన్స్‌ను తెగ అట్రాక్ట్ చేస్తోంది.
టెంపర్ సినిమా ఆడియో లాంచ్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ… ఇకపై అభిమానులు కాలర్ ఎగరేసే సినిమాలు చేస్తానని మాటిచ్చాడు. అప్పటి నుంచి అంటే 2015 నుంచి ఇప్పటివరకూ 2013… గత ఎనిమిది సంవత్సరాలుగా ఎన్టీఆర్, అభిమానులు కాలర్ ఎగరేసే సినిమాలే చేస్తున్నాడు. ఫాన్స్ టెంపర్ సినిమాని థియేటర్స్ లో చూసినప్పుడు ఎగరేసిన కాలర్ ని ఇప్పటివరకూ దించలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పాన్ వరల్డ్ లో ఎన్టీఆర్ ఫాన్ అనే వాడు ఎక్కడ ఉన్నా ఎన్టీఆర్ సక్సస్ ని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాడు. ఈరోజు గ్లోబల్ ఇమేజ్ ని ఎన్టీఆర్ సొంతం చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ కాలర్ ఎగరేసిన ఫోటో చూసిన ఫాన్స్ కి టెంపర్ ఆడియో లాంచ్ లో ఇచ్చిన మాట గుర్తొచ్చి ఉంటుంది. అందుకే ఫాన్స్ ఈ ఫోటోని వైరల్ చేస్తూ నిజంగా నువ్వ మా దేవర అంటున్నారు. ఇకపోతే.. ప్రస్తుతం దేవర షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.