దేవర వంటి బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు యంగ్ టైగర్. అదే జోష్ లో బాలీవుడ్‌లో ‘వార్ 2’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు టైగర్. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది.
Also Read : NBK : తమన్ కు ఖరీదైన కార్ ను గిఫ్ట్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ
అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 17 నుంచి ఎన్టీఆర్-నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే ఈ ఫస్ట్ షెడ్యూల్‌ని వికారాబాద్ అడవులు, పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ టీమ్ వికారాబాద్ అడవుల్లో లొకేషన్స్ కోసం రెక్కీ చేస్తున్నారట. ఈ అడవుల్లో కొన్ని ఫైట్ సీన్స్, నేచురల్ విజువల్స్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. అయితే ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ లేని సీన్స్ తెస్తున్నారు. మార్చి నెలలో ఎన్టీఆర్ ఈ షూటింగ్‌లో జాయిన్ అడుగుపెట్టబోతున్నాడు. ఎన్టీఆర్‌ను అత్యంత శక్తివంతమైన పాత్రలో ఆవిష్కరిస్తూ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రశాంత్‌నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. పైగా ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఇప్పటి నుంచే అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా KGF మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు మేకర్స్.