ప్రస్తుతం ట్విట్టర్లో దేవర టాప్‌లో ట్రెండ్ అవుతోంది. మేకర్స్ నుంచి ఓ ట్వీట్ లేదు, అప్డేట్ లేదు, అయినా కూడా దేవర రక్తపాతం మామూలుగా ఉండదని కొన్ని లీక్డ్ పిక్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. కొరటాల చెప్పిన మృగాల కథను ఇప్పటి నుంచే నెక్స్ట్ లెవల్లో ఊహించుకుంటున్నారు. మరిచిపోయిన కోస్టల్ ప్రాంతంలో మృగాలను భయపెట్టమే దేవర కథ అని చెప్పుకొచ్చాడు కొరటాల. అప్పటి నుంచి బాక్సాఫీస్ దగ్గర భయమంటే ఏంటో చూపిస్తామని అంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే.. దేవర లీక్డ్ పిక్స్ ఓ రేంజ్‌లో హై ఇస్తున్నాయి. గతంలో ఏకంగా బ్లడ్ ట్యాంక్స్ ఫోటోలు లీక్ అవడంతో అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. మామూలుగా మనం వాటర్ ట్యాంక్స్ లేదంటే మిల్క్ ట్యాంక్స్ చూస్తు ఉంటాం కానీ కొరటాల మాత్రం ఎన్టీఆర్ కోసం బ్లడ్ ట్యాంక్స్ రెడీ చేయించాడు. ఇక ఇప్పుడు కొన్ని బ్లడ్ బాటిల్స్ ఫోటోలు లీక్ అవడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. అలాగే షిప్, కంటైనర్ల ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఫ్యాన్స్ దేవర కత్తి నుంచి వచ్చిన రక్తంతో సముద్రం ఎరుపెక్కినట్టుగా ఉన్న ఫ్యాన్ మేడ్ ఫోటోలను కూడా వైరల్ చేస్తున్నారు. ఇక మరోవైపు దేవరలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ గ్లామర్ షోకి సోషల్ మీడియా హీటెక్కిపోతోంది. వరుణ్ ధావన్‌తో కలిసి జాన్వీ కపూర్ నటించిన ‘బవాల్’ మూవీ డైరెక్ట్‌గా ఓటిటిలో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ హాట్ ఫోటో షూట్‌లు తెగ ట్రెండ్ అవుతున్నాయి. జాన్వీ ఒంపు సొంపులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక ‘దేవర’ సినిమాలో జాన్వీ గ్లామర్ షో ఇంకెలా ఉంటుందోనని.. ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు తెలుగు కుర్రకారు. మరి రోజు రోజుకి హై ఇస్తున్న దేవర ఎలా ఉంటుందో తెలియాలంటే.. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.