ప్రస్తుతం సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ బ్యూటీ శ్రీలీల ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి దుబాయ్‌లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 వేడుక అట్టహాసంగా జరిగింది. ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను కష్టాల్లో ఉన్నపుడు, కింద పడినప్పుడు తనని పట్టుకొని లేపినందుకు.. అందరికీ నా పాదాభివందనాలు చేస్తున్నాను.. అని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. #ManofMasses #NTR #Devara టాగ్స్‌ని ట్రెండ్ చేస్తూ నందమూరి ఫ్యాన్స్, డై హార్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇక బెస్ట్ యాక్టర్‌గా ఎన్టీఆర్ అవార్డ్ అందుకోగా.. ఉత్తమ నటిగా యంగ్ బ్యూటీ శ్రీలీల ఈసారి సైమా అవార్డు సొంతం చేసుకుంది.
ధమాకా చిత్రంలో తన అద్భుతమైన పెర్ఫార్మన్స్‌కు శ్రీలీల ఈ అవార్డ్ ఎగరేసుకుపోయింది. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ధమాకాలో.. తనదైన డ్యాన్స్‌తో ఒక ఊపు ఊపేసింది శ్రీలీల. ప్రస్తుతం సైమా అవార్డ్స్ వేడుకలో పింక్ డ్రెస్‌లో మెరిసిన శ్రీలీల క్యూట్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడున్న హీరోయిన్లలో డ్యాన్స్ విషయంలో శ్రీలీల తర్వాతే ఎవ్వరైనా. ఇక యంగ్ టైగర్ డ్యాన్స్ గురించి చెప్పడానికి మాటలుండవు. అలాంటి ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే.. అదిరిపోయే మాస్ బీట్ పడితే.. థియేటర్ టాపులు లేచిపోతాయ్. ప్రజెంట్ టాలీవుడ్‌లో హాట్ కేక్‌గా మారిన శ్రీలీల… మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో ఛాన్స్ అందుకుంది. ఎన్టీఆర్‌తో కూడా అమ్మడు ఛాన్స్ కొట్టేస్తే… ఇక తిరుగుండదు.