ప్రస్తుతం సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ బ్యూటీ శ్రీలీల ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి దుబాయ్‌లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 వేడుక అట్టహాసంగా జరిగింది. ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను కష్టాల్లో ఉన్నపుడు, కింద పడినప్పుడు తనని పట్టుకొని లేపినందుకు.. అందరికీ నా…