గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం… కల్కిలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనేది. అసలు ఇందులో నిజం ఉందా? అనేది ఎవ్వరికీ తెలియదు కానీ కల్కిని నాగ్ అశ్విన్ ఎలా డిజైన్ చేస్తున్నాడనే ఊహాగానాలు మాత్రం అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కల్కి గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. కల్కి దెబ్బకు బాహుబలి 2 రికార్డులు కూడా డేంజర్ జోన్‌లో పడే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. ఎందుకంటే… ఈ సినిమా కంటెంట్ పరంగానే కాదు… విజువల్ పరంగా ఓ అద్భుతమే అంటున్నారు. బలమైన యాక్షన్ సీక్వెన్స్, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో పాటు అంతకుమించి బలమైన ఎమోషన్స్ కల్కిలో ఉన్నాయని టాక్. ఈ సినిమా కోసం ఏకంగా 5 విఎఫ్ఎక్స్ కంపెనీలు విజువల్ ఎఫెక్ట్స్ పై వర్క్ చేస్తున్నాయట. అందులో మూడు ఇండియన్ కంపెనీలు కాగా… ఒకటి న్యూజిలాండ్, ఒకటి యూఎస్ కంపెనీ అని తెలుస్తోంది.
ఇక కల్కి స్టార్ క్యాస్టింగ్ చూస్తే ఔరా అనాల్సిందే. ఈ సినిమాలో ప్రభాస్‌తోపాటు కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్, దీపికా పదుకొనె, దిశా పటానీ మెయిన్ కాస్టింగ్‌గా ఉన్నారు. వీరితోపాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రానా, మృణాల్ ఠాకూర్‌తో పాటు రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ వంటి వారు కూడా క్యామియో చేస్తున్నారనే టాక్ ఉంది. ఇక వీళ్లకు తోడు ఎన్టీఆర్ పేరు కూడా పెద్దగా సౌండ్ చేస్తోంది. కల్కిలో యంగ్ టైగర్ కాసేపు తెరపై కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీ వర్గాలు ఈ విషయాన్ని బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. ఒకవేళ… ప్రభాస్, ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే మాత్రం థియేటర్లు తగలబడిపోతాయ్… అని అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే… మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే!