కొరటాల శివ దేవర సినిమా రెండు భాగాలుగా ఉంటుంది… మొదటి భాగం శాంపిల్ మాత్రమే, వచ్చే ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 రిలీజ్ అవుతుంది ఆ తర్వాత పార్ట్ 2 ఉంటుంది అనే మాట అఫీషియల్ గా అనౌన్స్ చేయగానే నందమూరి ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే సమయంలో అయోమయంలో కూడా పడ్డారు. దేవర రెండు భాగాలైతే ఎన్టీఆర్-కొరటాల శివ వర్క్ కంటిన్యూ చేస్తారా? నీల్-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందా? ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ ఉన్నట్లా లేనట్లా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ అనుమానాలని క్లియర్ చేస్తూ ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. కాకపోతే నిన్న మొన్నటి వరకూ 2024 మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళ్తుంది అనుకుంటున్న ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు ఒక నెల లేట్ గా ఏప్రిల్ 2024 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీ ఏప్రిల్ నుంచి షూటింగ్ కి వెళ్తుంది అంటూ ప్రొడ్యూసర్స్ క్లారిటీ ఇచ్చారు. దీంతో నీల్-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై రైజ్ అయిన డౌట్స్ కి ఎండ్ కార్డ్ పడింది. దేవర ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుండడం, అదే నెలలో నీల్-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వడం చూస్తుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఏప్రిల్ నెలలో పండగే. సో 2024 ఏప్రిల్ నెల మొత్తం ఎన్టీఆర్ పేరు ఆన్ లైన్-ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా మోతమోగిపోవడం గ్యారెంటీ. వయోలెన్స్ పీక్ స్టేజ్ లో ఉండబోయే ఎన్టీఆర్ 31 సినిమాలో తారక్, డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడట. అందులో ఒకటి హీరో కాగా, ఇంకొకటి విలన్ క్యారెక్టర్. హీరో క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కానీ నెగటివ్ క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ యాక్టింగ్ కి యాంటి ఫాన్స్ కూడా ఫిదా అవుతూ ఉంటారు. క్యారెక్టర్ లో కొంచెం నెగటివ్ టచ్ ఉంటే చాలు ఆ రోల్ ని ఎన్టీఆర్, తన యాక్టింగ్ తో ఏ స్థాయికి తీసుకోని వెళ్తాడో ఇప్పటికే చాలా సార్లు చూసాం. ఈవిల్ స్మైల్, సెటిల్డ్ వాయిస్ తో ఎన్టీఆర్, థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ని స్టన్ చేస్తాడు. ఇంతటి పెర్ఫార్మర్ ప్రశాంత్ నీల్ చేతిలో పడుతున్నాడు అంటేనే, ఎన్టీఆర్ యాక్టింగ్ ఇంకో రేంజులో ఉండబోతుందని అర్ధం.
The most awaited project of @tarak9999 & #PrashanthNeel will commence in April, 2024 ❤️🔥
The prestigious high-octane spectacle will create a new benchmark in Indian Cinema 💥💥#NTRNeel 🔥@NANDAMURIKALYAN @NTRArtsOfficial pic.twitter.com/CxTPchxOPz
— Mythri Movie Makers (@MythriOfficial) October 5, 2023