మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడీ’. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో రవితేజ ఇద్దరు అందాల భామలు మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతితో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించగా, డిఎస్పీ సంగీతం అందించారు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల 11న విడుదల కానున్న ‘ఖిలాడీ’ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఇక సినిమా రన్ టైం విషయానికొస్తే… 2 గంటల 34 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. సినిమా విడుదలకు మరొక రోజు మాత్రమే మిగిలివుంది. ఈ సమయంలో సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read Also : Body shaming… తగిన సమాధానం చెప్పిన కాజల్
సాధారణంగా మన సినిమాలో యూఎస్ లో అయితే ఒకరోజు ముందుగానే ప్రీమియర్ అవుతాయన్న విషయం తెలిసిందే. కానీ ‘ఖిలాడీ’ సినిమా యూఎస్ఏ ప్రీమియర్లు లేవని టాక్ నడుస్తోంది. కంటెంట్ డిలే కారణంగా ‘ఖిలాడీ’కి అక్కడ ఇబ్బందులు తప్పట్లేదు. మరో విషయం ఏమిటంటే ఈ వార్తలో నిజమెంత అనే దానిపై క్లారిటీ లేదు. మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. అయితే టాలీవుడ్ లో మాత్రం అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. సినిమాలోని లిప్ లాక్ సీన్స్, సాంగ్స్ ‘ఖిలాడీ’పై అంచనాలను పెంచేశాయి. ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.