జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలోని 25వ చిత్రం, డేనియల్ క్రెయిగ్ నటించిన “నో టైమ్ టు డై” ఓటిటి విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రెయిగ్ చివరి చిత్రం. యూఎస్ లో 2021లో విడుదలైన ‘నో టైమ్ టు డై’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇది ప్రపంచ బాక్సాఫీస్ వద్ద $770 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా ఇండియాలోనూ విడుదలైంది. ఇక ఇప్పుడు ఈ జేమ్స్ బాండ్ ఓటిటి వీక్షకులను కూడా అలరించడానికి రెడీ అయ్యాడు. మార్చి 4న అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కానుంది. ఈ స్పై మూవీ హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ప్రసారం అవుతుందని అమెజాన్ ప్రకటించింది.
Read Also : RGV : మెగా బెగ్గింగ్ తో హర్ట్ అయ్యా… సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై సెటైర్లు
క్యారీ జోజి ఫుకునాగా దర్శకత్వం వహించిన ఈ మూవీని MGM, EON ప్రొడక్షన్స్ పై నిర్మించారు. ఈ చిత్రంలో క్రెయిగ్ ఐదవసారి గూఢచారి జేమ్స్ బాండ్‌గా నటించాడు. ఈ చిత్రంలో విలన్‌గా లూసిఫర్ సఫిన్‌గా రామీ మాలెక్, బాండ్ ప్రేమికురాలిగా లియా సెడౌక్స్, డాక్టర్ మడేలీన్ స్వాన్, బాండ్ రిటైర్ అయిన తర్వాత 007లో బాధ్యతలు చేపట్టిన కొత్త సీక్రెట్ ఏజెంట్ నోమిగా లాషానా లించ్, పలోమాగా అనా డి అర్మాస్ నటించారు. MI6 క్వార్టర్‌మాస్టర్ Q పాత్రలో బెన్ విషా, MI6 చీఫ్ Mగా రాల్ఫ్ ఫియెన్నెస్ తో పాటు నవోమీ హారిస్, క్రిస్టోఫ్ వాల్ట్జ్, రోరీ కిన్నియర్, డాలీ బెన్సలాహ్, డేవిడ్ డెన్సిక్, బిల్లీ మాగ్నుస్సేన్‌లు కూడా ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. 2022 సంవత్సరానికి గానూ “నో టైమ్ టు డై” ఉత్తమ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ సౌండ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఆస్కార్ నామినేషన్‌లను గెలుచుకుంది.