ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా అనౌన్స్ చెయ్యగానే… ఇది KGF సినిమాకి లింక్ అయ్యి ఉంటుంది, రాఖీ భాయ్-సలార్ కలిసి కనిపిస్తారు, సలార్ లో యష్ కనిపిస్తాడు అంటూ చాలా కథలు వచ్చేసాయి. సలార్ రిలీజ్ అవుతుంది అనే సరికి ప్రశాంత్ నీల్ యూనివర్స్ క్రియేట్ చేసాడు, ప్రభాస్-యష్ లు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తారు అంటూ సినీ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ… “ఈ సలార్ కి KGFకి సంబంధం లేదు. రెండు వేరు వేరు ప్రపంచాలు. ఒక పెద్ద హీరోతో సినిమా చేస్తున్నప్పుడు, యూనివర్స్ లోకి తీసుకోని వచ్చి మల్టీస్టారర్ చేయడం కరెక్ట్ కాదు. అది మన స్టార్ హీరోస్ కి ఇచ్చే రెస్పెక్ట్. అందుకే సలార్ స్టాండ్ అలోన్ సినిమాగానే ఉంటుంది. ప్రాపర్ గా ఆరు గంటల కథతో తెరకెక్కిన సినిమా, ఈ కారణంగానే రెండు పార్ట్స్ చేశాను” అని చెప్పేసాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ యష్ ఫ్యాన్స్… KGF-సలార్ సినిమాలకి సంబంధం లేదు అనే సరికి డిజప్పాయింట్ అయ్యారు కానీ ప్రశాంత్ నీల్ ముందే రివీల్ చేసి మంచి చేసాడు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఈ విషయాన్నీ చెప్పకుండా దాచిపెట్టి ఉంటే ఆడియన్స్ KGF లింక్ ఉంటుందేమో అనే ఆశతో థియేటర్స్ కి వెళ్తారు. ఆ లింక్ కనిపించకపోతే డిజప్పాయింట్ అవుతారు లేదా ఆడియన్స్ కోరుకుంటున్నారు అని కథకి సంబంధం లేకపోయినా లింక్ కలపాల్సి వస్తుంది, అప్పుడు లియో సినిమాలా అవుతుంది. లియో కథకి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధం లేకపోయినా లోకేష్ ఆడియన్స్ కోరుకుంటున్నారు అని విక్రమ్ తో లింక్ చేసాడు. ఈ లింక్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వకపోవడంతో లియో సినిమాపై నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ప్రశాంత్ నీల్ ఆ తప్పు చేయకుండా ముందే చెప్పేసాడు కాబట్టి ఆడియన్స్ కేవలం సలార్ సినిమాని చూడడానికి మాత్రమే థియేటర్స్ కి వస్తారు.