డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎన్సీబీ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ఎన్సీబీ కోర్టు. ఈనెల 7 వరకు ఆర్యన్ కస్టడీలో ఉంచాలని ఎన్సీబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. ఆర్యన్ ఖాన్ మరో మూడు రోజుల పాటు కస్టడీలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా ముంబై క్రూయిజ్ రేవ్ పార్టీపై దాడిలో ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ తో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆర్యన్ తోపాటు పలువురు నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఆర్యన్ ఖాన్కు బెయిల్ రాకపోవడంతో కేసు మరింత బలంగా మారేలా కనిపిస్తోంది.