సస్పెన్షన్‌కు గురైన జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. మైసూరు జిల్లాలోని కేఆర్ నగర్‌లో ఓ మహిళ కిడ్నాప్‌కు సంబంధించిన కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కోడలు భవానీ బుధవారం ముందస్తు బెయిల్‌ను కోరింది. ఈ క్రమంలో ఆ పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ (Sanjay Singh)కు మళ్లీ నిరాశ ఎదురైంది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ దశలో బెయిల్‌పై విడుదల చేయడం సరికాదని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్ గార్గ్ మిశ్రా బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చారు.
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎన్‌సీబీ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ఎన్‌సీబీ కోర్టు. ఈనెల 7 వరకు ఆర్యన్ కస్టడీలో ఉంచాలని ఎన్‌సీబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. ఆర్యన్ ఖాన్ మరో మూడు రోజుల పాటు కస్టడీలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ముంబై క్రూయిజ్ రేవ్ పార్టీపై దాడిలో ఎన్‌సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్…