మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు గుర్తుండిపోయే చిత్రాలుగా మిగిలిపోయాయి. ప్రస్తుతం వీరి మూడో సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా, లాక్‌డౌన్ పరిస్థితులు చక్కబడ్డాక మూవీ షూటింగ్ మొదలు కానున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాలో స్ట్రెయిట్ హీరోయిన్ ఎవరనేది ఇంతవరకు తెలియనప్పటికీ, సెకండ్ హీరోయిన్ పేరు మాత్రం చక్కర్లు కొడుతుంది. వకీల్ సాబ్ సినిమా సక్సెస్ తో మంచి జోరు మీదున్న నివేథా థామస్ మహేష్-త్రివిక్రమ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందంటూ టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఇక త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే గనుక నిజమైతే నివేథా థామస్ మరోసారి బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే!