Nithiin: ప్రస్తుతం సినీ ప్రముఖులందరూ రాజకీయాలవైపు చూస్తున్నారా..? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఒకప్పుడు సీనియర్ నటులు సినిమాల తరువాత రాజకీయాల వైపు చూసేవారు కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి వస్తుంది అంటూ వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. కాంగ్రెస్ లో ఆమె చేరుతుందని రూమర్స్ వినిపించాయి. అయితే ఈ రూమర్స్ పై ఆమె ఘాటుగా స్పందించింది. తన దృష్టి అంతా సినిమాలే అని చెప్పి రూమర్స్ కు చెక్ పెట్టింది.
ఇక తాజాగా మరో యంగ్ హీరో రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ బీజేపీ లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అందుకు కారణం కూడా లేకపోలేదు. రేపు బీజేపీ నేత జెడ్డి నడ్డాతో నితిన్ భేటీ కానున్నారు. అయితే ఈ భేటీ నితిన్ రాజకీయ ఎంట్రీ గురించే అని వార్తలు వస్తున్నాయి. రేపు శంషాబాద్ ఎయిర్ పోర్టులో నితిన్ ను మీట్ అవ్వబోతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే నితిన్ వరుస సినిమాలు చేస్తున్నాడు. మరోపక్క తండ్రి నిర్మాణ రంగంలో కూడా తానే చూసుకొంటున్నాడు. ఇటీవల విక్రమ్ సినిమాను తెలుగులో నితిన్ ప్రొడక్షన్ హౌస్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ అందిపుచ్చుకొని విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ నేపథ్యంలో మరో స్టెప్ వేయడానికి నితిన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే నితిన్ కు బీజేపీ ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తుంది అనేది తెలియాల్సి ఉంది.