Nithiin32: మాచర్ల నియోజకవర్గం తర్వాత నితిన్ నుంచి ఎలాంటి సినిమా వచ్చింది లేదు. ఈ సినిమా నితిన్ కి భారీ పరాజయాన్ని అందించిన విషయం తెల్సిందే. ఇక ఈసారి ఎలాగైనా మంచి హిట్టు అందుకోవాలని నితిన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే నితిన్, వంశీ వక్కంతం దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించాడు. ఇప్పటికే తనకు భీష్మతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుములతో ఒక సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. దీంతోపాటు వంశీ వక్కంతం సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకురానున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీల నటిస్తుంది. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎం సుధాకర్ రెడ్డి నికితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Rajamouli: రిలీజ్ డేట్ గురించి నువ్వు అడుగుతున్నావా.. జక్కన్న.. అస్సలు బాగోదు
హరీష్ జయరాజ్ సంగీత అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ సినిమా నుంచి నితిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను జూలై 23 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో అభిమానులు ఈ సినిమా పోస్టర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. గతంలో ఇదే కథను అల్లు అర్జున్ తో ఐకాన్ టైటిల్ లో అనౌన్స్ చేశాడు. ఇప్పుడు బన్నీ ప్లేస్ లో నితిన్ వచ్చాడు. అసలు ఆ కథ.. ఈ కథ ఒకటేనా.. ? వేరే వేరా ..? అనేది తెలియాలంటే.. పోస్టర్, టైటిల్ రిలీజ్ కావాల్సిందే అని అభిమానులు అంటున్నారు. మరి ఈ సినిమాతోనైనా నితిన్ హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.