Rajamouli: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈరోజు శాన్ డియాగో కామిక్ ఖాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టైటిల్ ను. ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి ఒంటిగంటకు రిలీజ్ చేసినా కూడా అభిమానులు ఈ వీడియో కోసం నిద్రలు మానుకొని మరి వేచి చూసారు. ఇక రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి ఈ వీడియో గురించే చర్చ జరుగుతుంది. ఇందులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. దీంతో ప్రభాస్ ఫాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇక అభిమానులే కాకుండా సెలబ్రిటీలు సైతం ఈ వీడియో గురించి మాట్లాడుతూ ప్రభాస్ ను, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను ప్రశంసిస్తున్నారు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఈ గ్లింప్స్ పై ప్రశంసలు కురిపించాడు.
Hidimba: నరమాంస భక్షకుడు.. కొద్దికొద్దిగా ఎక్కేస్తున్నాడు
“గ్రేట్ జాబ్ నాగి అండ్ వైజయంతి మూవీస్. ఒక ప్రామాణికమైన భవిష్యత్తు చిత్రాన్ని రూపొందించడం చాలా కష్టమైన పని దాన్ని మీరు సాధ్యం చేశారు డార్లింగ్ లుక్ అదిరిపోయింది కానీ ఒక్క ప్రశ్న మాత్రం మిగిలి ఉంది రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేదు” అంటూ ట్వీట్ చేశాడు. ఇక దీనికి బాహుబలి ప్రొడ్యూసర్ శోభయార్లగడ్డ ఫన్నీగా స్పందించాడు. “రిలీజ్ డేట్ గురించి ఎవరు అడుగుతున్నారు చూడండి” అంటూ కౌంటర్ వేశాడు. దీంతో అభిమానులు సైతం రిలీజ్ డేట్ గురించి నువ్వు అడుగుతున్నావా జక్కన్న అస్సలు బాగోదు.. వదిలేయంటూ కామెంట్స్ పెడుతున్నారు. రాజమౌళి సినిమా అంటే మినిమం నాలుగేళ్లు పడుతుంది. రిలీజ్ డేట్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు దాదాపు నాలుగు రిలీజ్ డేట్లు ప్రకటించాడు జక్కన్న. చివరికి మార్చి 25న రిలీజ్ చేశాడు. దీంతో రిలీజ్ డేట్ గురించి నీకు మాట్లాడే హక్కు లేదని అభిమానులు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Look who is asking the release date !! 😆😆 https://t.co/owQff2ku0f
— Shobu Yarlagadda (@Shobu_) July 21, 2023