Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా మంచి బిజీగా మారింది. గత కొన్నిరోజుల నుంచి నిహారిక వైవాహిక జీవితంలో అడ్డంకులు ఉన్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిపై మెగా కుటుంబం కానీ, నిహారిక కానీ స్పందించలేదు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాకు కొంచెం గ్యాప్ ఇచ్చిన నిహారిక గత వారం నుంచి యమా యాక్టివ్ అయ్యి కనిపించింది. నిత్యం తనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది అన్నట్లు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న రెడ్ కలర్ లంగా వోణి, ముక్కుకు ముక్కెర పెట్టుకొని ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవికాస్తా నెట్టింట వైరల్ గా మారే. ఇప్పుడిప్పుడే మెగా డాటర్ కొద్దిగా సోషల్ మీడియామీద ఫోకస్ పెడుతుందని నెటిజన్లు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా మరోసారి మరో ఫోటోషూట్ తో నిహారిక కవ్వించింది.
Samantha: శోభితతో చైతన్య ఎఫైర్.. సమంత అంత మాట అన్నదా..?
అందమైన పింక్ కలర్ చీర.. దానిపై బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్.. ముక్కుకు ముక్కెర పెట్టుకొని అదరగొట్టింది. ఇక పుల్లటి మామిడికాయ ముక్కను తింటూ రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో ఉన్న ఫోటోలను మొత్తం కలిఫై ఒక వీడియోగా తయారుచేసి పోస్ట్ చేసింది. అందుకు క్యాప్షన్ గా.. “మామిడికాయలు లేకుండా సమ్మర్ ఏంటి..” అంటూ చెప్పుకొచ్చింది. నిహారిక ఈ చీరలో ఎంతో అందంగా కనిపించింది. ఇక ఈ వీడియో చూసిన వారందరు.. నిహారిక ఏమన్నా విశేషమా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే నిహారికకు జొన్నలగడ్డ చైతన్యతో 2020లో వివాహం జరిగింది. మరి వీరు ఆ శుభవార్త ఎప్పుడు చెప్తారో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.